ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లకు అడుగుపెట్టి స్టార్ట్ డైరెక్టర్లుగా సక్సెస్ అందుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా.. సందీప్ రెడ్డి వంగా సైతం తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. మాస్ యాక్షన్.. ఎమోషనల్ బోల్డ్ కంటెంట్‌ను సమపాళ్లల్లో చూపిస్తూ.. ఆడియన్స్‌కు కనెక్ట్ చేసుకోవడంలో సందీప్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. తను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.
ముఖ్యంగా ఇండియన్ సినీ హిస్టరీలో. కాగా.. సందీప్ తను డైరెక్ట్ చేసే సినిమాల విషయంలో ఎంత అద్భుతంగా డెడికేషన్ చూపిస్తాడో.. షూట్ టైం లో కోపం వస్తే అంతే వేగంగా కోపాన్ని కూడా చూపించేస్తాడట. అలాంటిది.. సందీప్ సినీ కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క స్టార్ హీరో ఆయన ఈగోని హర్ట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. ఎస్.. అర్జున్ రెడ్డి సినిమా టైం లో.. విజయ్ దేవరకొండా కామెంట్స్‌కు కోపం వచ్చిన సందీప్.. అక్కడే విజయ్‌పై ఫైర్ అయ్యాడట.అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందింది.
ఈ క్రమంలోనే సినిమా.. సెట్స్‌పైకి రాకముందే చాలా మంది హీరోస్ కథ వర్కౌట్ అవుతుందో.. లేదో.. అనే భయంతో దానిని రిజెక్ట్ చేశారట. అలాంటి స్టోరీకి.. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ.. విజయ్ లో ఏదో ఒక మూల డౌట్ మాత్రం ఉండనే ఉందట. సినిమా చేస్తున్న టైంలో చాలాసార్లు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా.. అసలు సినిమా చూస్తారా అనే ప్రస్నలకు.. నువ్వు చేసే ప్రాజెక్టుపై.. ఫస్ట్ నువ్వు కాన్సెంట్రేట్ చెయ్.. నీకు ముందు నమ్మకం ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతుందని వార్నింగ్ ఇచ్చాడట. సందీప్ వార్నింగ్‌తో విజయ్ దేవరకొండకు కాస్త నమ్మకం కుదిరిందట. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాను కంప్లీట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే.