ఐఫోన్ తో మూవీ తీసి రూ. 450 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్.. మన తెలుగోడే.. మూవీ ఏంటంటే..?

ఎస్.. ఐఫోన్ తో తీసిన సినిమా.. రూ.450 కోట్లకు పైగా కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఓ తెలుగు కుర్రాడు సరదాగా మొదలుపెట్టిన షార్ట్ ఫిలిం.. అనుకోకుండా బిగ్గెస్ట్ సినిమాగా మారిపోయింది. కేవలం 13 రోజుల్లో షూట్ కంప్లీట్ చేశాడు. కానీ.. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్‌ కోసం 18 నెలలు కేటాయించాడు. కట్ చేస్తే.. రూ.7కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమా.. రూ.490 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ.. ఆ డైరెక్టర్ పేరేంటి.. ఆ మూవీ ఏంటి.. అసలు వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ కుర్ర డైరెక్టర్ పేరు అనీష్ చాగంటి. మన తెలుగువాడే కావడం విశేషం.

RUN with Director Aneesh Chaganty - Alternate Ending : Alternate Endingకాకపోతే పుట్టి పెరిగింది అంత అమెరికాలో. 28 ఏళ్ళ వయసులోనే హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. మూవీ పేరు ” SRAECHING ” . ఇక కథ విషయానికొస్తే.. కాలిఫోర్నియాలో తన టీనేజ్ కూతురుతో కలిసి.. 37 సంవత్సరాల డేవిడ్ అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. ఓ రోజు అతని 16 సంవత్సరాల కూతురు కనిపించకుండా పోతుంది. ఆమెను తన పర్సనల్ కంప్యూటర్ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. స్క్రీన్ లైఫ్, థ్రిల్లర్ జానర్లో తెర‌కెక్కిన ఈ మూవీ.. కంప్యూటర్ స్క్రీన్, స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు లాంటి వాటన్నింటితో కనెక్ట్ చేస్తూ స్టోరీ చెప్పడానికి చాలా డిఫరెంట్గా ప్రయత్నించాడు.

Searching' Review -- Variety Critic's Pick

ఎక్కడా రెగ్యులర్ సినిమా చూసిన.. ఫీల్ కాకుండా ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేలా స్టోరీ రూపొందించారు. సినిమా షూటింగ్ కు ఎక్కడ సినిమా కెమెరాలను వాడలేదు. గోప్రో, డ్రోన్, మినీ టీవీ, ఐ ఫోన్ లతో మాత్రమే షూట్ కంప్లీట్ చేశాడు. చాలా వరకు.. సినిమా ఓకే ఇంట్లో చిత్రీకరించారు. ఇంతకుముందు సినిమా తీసిన అనుభవం కూడా లేని కుర్రాడు.. యుసిఎల్‌ఏ స్కూల్ ఆఫ్ థియేటర్ ఫిలిం అండ్ టెలివిజన్ నుంచి.. ఫిలిమ్స్ అండ్ ఎలివేషన్స్ లో డిగ్రీ పట్టా పొందాడు. ఈ క్రమంలోనే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో.. ఈ సినిమాను ప్రారంభించాడు. 2018 ఆగస్టు 24న రిలీజ్ అయిన ఈ మూవీ విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. కేవలం 8,80,000 అమెరికన్ డాలర్లు ఖ‌ర్చుచేయ‌గా.. సినిమా 75.6 మిలియన్ డాలర్ల వసూళ్లను కొల్లగొట్టడం విశేషం. ఇక ఈ సినిమా సోనీ లివ్ ఓటిటిలో వీక్షించవచ్చు.