బిగ్‌బాస్ సీజన్ 9.. హౌస్ లో వైల్డ్ కాత్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దివ్వెల మాధురి షోలో ఏ రేంజ్ లో కంటెంట్ ఇస్తుందో తెలిసిందే. మొదటి వారం నుంచి బలుపు చూపిస్తూ.. ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై నోరు వేసుకొని పడిపోతుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. తిరిగి ఎవరైనా కౌంటర్ వేస్తే గొంతు తగ్గించుకో అంటూ బలుపు చూపిస్తూ వచ్చింది. ఒక్క తనూజతో తప్ప.. అందరితోనూ వార్ పెట్టుకుంది. అయితే.. గత వీకెండ్ నాగార్జున నుంచి వచ్చిన హెచ్చరికలు.. ఆడియన్స్ ప్రవర్తనను గమనించి అప్పటినుంచి కంటెస్టెంట్స్‌తో పాజిటివ్ గా ఉండడం ప్రారంభించింది. మొదటి వారం మొత్తం దివ్యను అనరాని మాటలు అన్న ఆమె.. వీకెండ్ ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ అవ్వగానే దివ్యకు దగ్గర అయింది.
దివ్య కూడా ఆమెను నమ్మి మంచిగా ఉండడం మొదలుపెట్టింది. అంతే కాదు.. గత వారం పవన్ కళ్యాణ్, రీతూ చౌదరిలతోనూ గొడవ వేసుకున్న ఆమె.. వాళ్ళతో కూడా ఇప్పుడు మంచిగా ప్రవర్తిస్తుంది. అదంతా ఫేక్ అని ఆడియన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక.. బిగ్ బాస్ హౌస్ లో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫేక్ ఫేస్ ఎప్పుడు ఒకప్పుడు రివీల్ అవుతుంది. అలా.. శుక్రవారం ఎపిసోడ్ లో రీతూ చౌదరి పట్ల మాధురి బిహేవియర్ తో ఆమె ఫేక్ ఫేస్ బయటకు వచ్చింది. రీతూని బయట కూడా ఎవ్వరూ ఈ రేంజ్ లో మాటలు అనరేమో అనేంతలా విరుచుకుపడింది. దారుణంగా తిట్టి పడేసింది. అంతేకాదు.. తర్వాత శనివారం ఎపిసోడ్లో సాయితో కూడా ఇలాగే రెచ్చిపోయి నోరు జారింది. ఇలా ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడిపోయింది.
అయితే అందరితో నోటికొచ్చినట్లు మాట్లాడిన మాదిరి.. తనూజతో మాత్రం మంచిగా మాట్లాడుతూ ఆమెతో హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రధాన కారణం తనూజకు భారీ ఓటింగ్ ఉండడం. తను నామినేషన్స్ లో ఉన్నప్పుడు తనూజ ఫ్యాన్ బేస్ ఓట్లు తనకు పడతాయనే ప్లానింగ్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నేటి ఎపిసోడ్లో ఇంతకు మించిపోయే బిగ్ ట్విస్ట్ ఉండనుందట. అదే తనూజ మాధురిని డైరెక్ట్ నామినేట్ చేయడం. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. ఆదివారం జరిగిన టాస్క్ లో తనూజ విన్నర్. గోల్డెన్ బజార్ సొంతం చేసుకుంటుంది. దీంతో ఒకరిని ఎలిమినేట్ నుంచి సేవ్ చేయడం.. ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయడం.. ఈ రెండు పవర్స్ వస్తాయి. అయితే.. ఈ పవర్స్ ని ఉపయోగించి డైరెక్ట్ నామినేషన్స్ లో తనుజ మాధురిని ఉంచనుందట.
దానికి కారణం కూడా మాధురినే.. స్వయంగా తానే డైరెక్ట్ నామినేట్ చేయమని తనూజను అడిగిందట. అసలు మ్యాటర్ ఏంటంటే.. శనివారం హౌస్‌లో బోర్డ్ గేమ్ లో ఎక్కువ బోర్డులు మాధురికే వచ్చాయి. దీంతో ఆమెకు శిక్ష వేయాలి కనుక.. నాగార్జున తనకు రెండు ఛాయిస్ లు ఇచ్చాడు. ఒకటి గార్డెన్ మరియు ఇల్లు క్లీనింగ్, రెండవది డైరెక్ట్ నామినేషన్. ఈ నిర్ణయాన్ని తనూజ.. చేతిలో పెట్టాడు నాగ్. దీంతో మాదిరి నాకు అసలు క్లీనింగ్, గార్డెనింగ్ వద్దు. డైరెక్ట్ గా నామినేట్ చేసేయమని చెప్పిందట. ఈ క్రమంలోనే తనూజ డైరెక్ట్ నామినేట్ చేసిందని తెలుస్తుంది. వాస్తవం ఎంతో తెలియాలంటే మరి కొంతసేపు వేచి చూడాల్సిందే.

