సినీ ఇండస్ట్రీలోకి ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఎవరి లైఫ్ ఎలా ఛేంజ్ అవుతుందో.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు.. అసలు హీరోనేనా.. ఒకటి రెండు అవకాశాల కంటే సినిమాల్లో ఛాన్సులు రావడమే కష్టం అని ఫీల్ అయిన హీరోలు సైతం.. ఒక్క సక్సెస్ తో స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే లిస్ట్‌లోకి ఇప్పుడు కిరణ్ అబ్బవరం చేరిపోయాడు. క లాంటి సెన్సేషనల్ థ్రిల్లర్‌తో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో.. రీసెంట్గా కె – రాంప్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో.. బల్లగుద్ది చెప్పి మరి హిట్టు కొట్టాడు కిరణ్. దీంతో.. రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది.
దీంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో కిరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే.. ఆయనకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. త్వరలోనే కిరణ్.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంపౌండ్‌లో అడుగుపెట్టనున్నాడట. సుకుమార్ శిష్యుడు వీరా కోగటం.. ఇటీవల కిరణ్ అబ్బవరంకు ఒక కథను వినిపించాడని కథ కిరణ్‌కు నచ్చేయడంతోచచ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తెలుస్తుంది. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే.. సుకుమార్ స్టైల్లో సరికొత్త పాయింట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు తానే స్వయంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నడట.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. అంతేకాదు.. ఈ సినిమాకు రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ అందించినున్నాడని సమాచారం. సుక్కు తన అన్ని సినిమాలకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకుంటాడు. కనుక ఈ ప్రాజెక్టులోను ఆయన డిఎస్పిని కావాలని సెలెక్ట్ చేశాడట. సుకుమార్ అడిగాక దేవి నో చెప్పడు. కనుక కిరణ్ సినిమా కోసం డిఎస్పీ మ్యూజిక్ అందించనున్నాడని తెలుస్తోంది. సుక్కు, డిఎస్పితో వర్క్ చేయడం అంటే ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలు నెలకొంటాయి. ఇక సినిమా కనుక రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే కిరణ్ రేంజ్ మరింతగా పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.


