ప్రస్తుతం పాన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో మహేష్ – రాజమౌళి మూవీ పేరే మొదట వినిపిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమా అంటే ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంటుంది. అలాంటిది.. జక్కన్న – మహేష్ కాంబోలో మూవీ అంటే.. ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవ్వడం కామన్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కు ఫుల్ ట్రేడ్ ఇచ్చేలా సినిమా నుంచి నవంబర్లో స్ట్రాంగ్ అప్డేట్స్.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు హైదరాబాదులో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన. ఈ ఈవెంట్ లోనే క్యాస్టింగ్ వివరాలు.. మూవీ కథను కూడా రాజమౌళి రివీల్ చేసే అవకాశము ఉందని టాక్ నడుస్తుంది.
![]()
అంతేకాదు.. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరున్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నాడని టాక్. ఇలాంటి క్రమంలో.. ఎస్ఎస్ఎంబి 29 కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ లీక్ చేశాడు కీరవాణి కొడుకు కాలభైరవ. రాజమౌళి ప్రతి సినిమాలోని కీరవాణి సాంగ్స్ అందిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్ఎస్ఎంబి 29 గురించి కాలభైరవ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. కొద్దిసేపటి క్రితం సుమా కొడుకు లేటెస్ట్ మూవీ.. మొగ్లీ ప్రమోషన్ ప్రెస్ మీట్‌లో కాలభైరవ సందడి చేశాడు. ఇందులో భాగంగానే విలేకరుల ప్రశ్నకు కాలభైరవ ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఇక.. ఓ విలేకరి అడుగుతూ ఆర్ఆర్ఆర్‌లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. దానిలోను మీరు భాగమయ్యారు. అదే విధంగా కొమరం భీముడు సాంగ్ అద్భుతమైన మీ గాత్రాన్ని అందించారు.

ఇప్పుడు మహేష్, రాజమౌళి సినిమాలోను మీరు పార్ట్ అయితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నాం. అది అవుతుందా అంటూ ప్రశ్నించగా.. కాలభైరవ తప్పకుండా అంటూ రియాక్ట్ అయ్యాడు. మహేష్ బాబు గారి సినిమానే కాదు.. నాన్నగారు చేసే ప్రతి సినిమాలోని నా అవసరం ఉంటే కచ్చితంగా ఆయన నాకు పని ఇస్తారు. మహేష్, రాజమౌళి సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి. త్వరలోనే ఫ్యాన్స్‌కు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉండబోతుందంటూ వివరించాడు. ప్రస్తుతం కాలభైరవ చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. అంతేకాదు.. నవంబర్ నెల నుంచి సినిమా సంబంధించిన వరుస అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక నవంబర్‌లో సినిమా నుంచి వచ్చే ట్రీట్ ఏ రేంజ్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతుందో చూడాలి.

