స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సిద్దు.. తర్వాత హీరోగా మారి తనదైన స్టైల్ లో విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి సక్సెస్లు అందుకొని బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న సిద్దు.. రీసెంట్గా తెలుసుకదా సినిమాతో ఆడియన్స్ను పలకరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ఆడియన్స్ను పలకరించింది. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమాకు నీరజ దర్శకత్వం వహించగా.. శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్గా మెరిశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించగా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది.
ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు జొన్నలగడ్డ.. తెలుగు సినిమాలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల.. సిద్దు చేసిన తెలుసుకదా మూవీ సినిమాను కొంతమంది ఫస్ట్ ఆఫ్ బాగుందని.. మరి కొంత మంది సెకండ్ హాఫ్ బాగుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే.. సినిమా బాగోలేదని మాత్రం ఎవరు చెప్పలేదు. ఈ క్రమంలోనే.. సిద్ధు జొన్నలగడ్డ సినిమా రివ్యూల పై మాట్లాడుతూ.. సినిమాను పూర్తిగా చూస్తేనే అది అందరికీ అర్థమవుతుందని వివరించాడు. హాలీవుడ్ సినిమాల్లో ఇంటర్వెల్స్ ఉండవని.. తెలుగు సినిమాల్లో పాప్కొర్న్ అమ్ముకోవడానికి ఇంటర్వెల్ అనే పంచాయతీ పెట్టారంటూ ఘాటు కామెంట్స్ చేశాడు.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసి ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ ముందు మంచి హైప్ ఇచ్చేస్తున్నారు.. ఆ హైప్ తో ఉన్న ఆడియన్స్ ఇంటర్వెల్ కి కాసేపు రెస్ట్ తీసుకోవడం.. మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. వారిని మళ్లీ ఫీల్ లోకి తీసుకురావడానికి కాస్త టైం పడుతుందంటూ సిద్దు జొన్నలగడ్డ వివరించాడు. ప్రస్తుతం సిద్దు చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి. తన సినిమా గురించి మాట్లాడేటప్పుడు మొత్తం తెలుగు సినిమాలను ప్రస్తావిస్తూ ఇంటర్వెల్ పంచాయితీ.. పాప్కార్న్ అంటూ చేసిన కామెంట్స్ తెలుగు సినిమాలను కించపరిచేలా ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఇంటర్వెల్ ఏం అడ్డురాదు. ఇప్పటికే ఎన్నో టాలీవుడ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నాయి. అవన్ని ఇంటర్వెల్ ఉన్న సినిడాలే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.