శివ రీ రిలీజ్: రెండు లారీలు సిద్ధం చెయ్యి.. బన్నీ పోస్ట్ పై నాగార్జున రియాక్షన్ ఇదే..!

ఒకప్పుడు బ్లాక్ బ‌స్టర్ మూవీ శివ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సునామీ సృష్టించి బిగ్గెస్ట్ కల్ట్ క్లాసికల్ మూవీ ఇది. అప్పట్లో.. థియేటర్‌ల‌లో సినిమా ఏ రేంజ్ లో సందడి చేసిందో చెప్పనవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా.. దాదాపు 36 ఏళ్ల క్రితం ఈ సినిమా రిలీజై.. ఇండ‌స్ట్రీలో పూర్తిగా ఛేంజ్ తెప్పించింది. ఇప్పుడు ఈ లెజెండ్రీ బ్లాక్ బస్టర్ మూవీని.. నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా అప్పట్లో రిలీజై యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్ లో, రియాలిటీ టేకింగ్, మ్యూజిక్, నాగార్జున స్టైల్ ఇలా అన్ని సినిమాకు హైలెట్‌గా మారాయి.

Allu Arjun Hails Shiva as Telugu Cinema's Turning Point Ahead of 4K Re- Release

ఈ క్రమంలోనే సినిమా రీ రిలీజ్ విషయంలోనూ ఇప్పుడు టాలీవుడ్ అదే రేంజ్ లో ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ఆష‌తోష్కోవార్‌గాస్.. సినిమా విషయంలో తమ అనుభవాలను వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ సైతం స్పెషల్ మెసేజ్ ను అందించాడు. బన్నీ మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో శివ ఒక ఐకానిక్‌ మూవీ అని.. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి కొత్త దారులు చూపించిన మూవీ ఇది.. మాస్‌, టెక్నికల్ బ్రిలయన్స్‌ను కలగలిపిన అద్భుతం. అలాంటి సినిమా.. మళ్లీ థియేటర్లో చూడడమంటే తెలుగు ఆడియన్స్‌కు బిగ్గెస్ట్ సెలబ్రేషన్.

Celebrating Nagarjuna Akkineni: 5 best performances of the legendary actor

ఈసారి.. ధియేటర్లకు వెళ్లేటప్పుడు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి అంటూ బన్నీ తనదైన మాస్‌ స్టైల్ లో సినిమాను ఎలివేట్ చేశాడు. బన్నీ ఇచ్చిన ఈ ఫ్యాన్ ఫుల్ మెసేజ్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే బన్నీ పోస్ట్ కు ఇటు నాగార్జున రియాక్ట్ అవుతా.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్ వీడియోను ట్యాగ్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్ మీకు రెండు లారీల థాంక్స్ అంటూ రియాక్ట్ అయ్యాడు. ఇక.. ఇప్పటికే సినిమా రీ రిలీజ్ కు నాగ్‌ ఫ్యాన్స్ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. 36 ఏళ్ల తర్వాత శివ మళ్ళీ థియేటర్లో గర్జించబోతున్నాడు.