స్టార్ బ్యూటీ తమన్నదశాబ్దంన్నర పాటు.. ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించిన రేంజ్ లో సక్సెస్ లో అందుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే.. పలు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తుంది. బాలీవుడ్‌లోను మెరుసం్తుంది. ఈ క్రమంలోనే తాజాగా స్త్రీ 2 మూవీలో ఆజ్ కి రాత్.. అనే స్పెషల్ సాంగ్ లో చిందేసింది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో తమన్న.. మా పిల్లలు ఈ సాంగ్ చూడకపోతే నిద్రపోవడం లేదు.. అన్నం కూడా తినడం లేదు.. మీ పాట పెట్టే నిద్ర పుచ్చుతున్నామని చెప్తున్నారు అంటూ కామెంట్స్ చేసింది. అయితే.. తమన్న చేసిన ఈ కామెంట్స్ పై తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అన్న కపూర్ కాంట్రవర్ష్యల్ కామెంట్స్ చేశారు.
తమన్న ఆరోజు తన పాట చూసి చిన్న పిల్లలు నిద్రపోతున్నారని చెప్పుకొచ్చింది. అయితే.. ఏ వయసులో ఉన్న పిల్లల్ని నిద్రపుచ్చుతుంది.. 70 ఏళ్ళ వయసులో ఉన్న ముసలి వాళ్లు కూడా పిల్లలతోనే సమానం కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఒకవేళ నేను అక్కడ ఉంటే తమన్నని ఇదే ప్రశ్న అడిగే వాడినని.. తమన్నది ఎంత అద్భుతమైన మిల్క్ బాడీ.. నీ బాడీ వల్ల పాల లాంటి నీ శరీరంతో ఎంతోమందిని నిద్రపుచ్చుతున్నావ్. చిన్న పిల్లలే కాదు.. 70 ఏళ్ల ముసలోళ్ళు కూడా నీ పాట చూసి పడుకుంటున్నారు అంటూ కాంట్రవర్షల్ కామెంట్ చేసాడు.
అయితే.. అన్న కపూర్ వ్యాఖ్యలు నెటింట వైరల్‌గా మారడంతో.. అతనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సీనియర్ నటుడు హోదాలో ఉన్న నువ్వు ఇలాంటి కాంట్రవర్షల్ కామెంట్స్ చేయడమేంటి.. అది కూడా హీరోయిన్ వృత్తిని అవమానించినట్లు.. ఆమె మాటలను వెక్కిరించినట్లు మాట్లాడటం ఏంటి అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు.. నీ మనవరాలు ఉన్న వయసున్న అమ్మాయి గురించి తన బాడీ గురించి ఇలాంటి కామెంట్స్ ఎలా చేయగలుగుతున్నావ్.. మీ ఇంట్లో ఆడపిల్లలపై కూడా ఇలాగే కామెంట్లు చేయగలవా.. అంటూ ఫైర్ అవుతున్నారు. మరి.. అన్న కపూర్ కాంట్రవర్షల్ కామెంట్స్ పై తమన్న ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.