టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగా ఎలాంటి మార్పులు క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇదే సినిమాను కబీర్ సింగ్ గా బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ సైతం మంచి సక్సెస్ అందుకున్నాడు. రెండు సినిమాల తర్వాత తన నుంచి వచ్చిన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా సంచలన రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే సినిమాకు సీక్వల్ గా యానిమల్ పార్క్ ఉంటుందంటూ సందీప్ రెడ్డి వంగ అఫీషియల్ గా ప్రకటించాడు.
ఇక.. ఇటీవల కాలంలో ఓ సినిమా మంచి రిజల్ట్ అందుకుని సక్సెస్ అయితే చాలు ఆడియన్స్‌లో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆ సినిమాను క్యాష్ చేసుకుంటూ డైరెక్టర్లు ఫ్రాంఛైజ్‌లపై ఫ్రాంఛైజ్‌లు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చూస్తూనే ఉన్నాం. అలాగే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సాహో, ఓజీ 2, ఓజీ 3 సినిమాలు త్వరలో తెరకెక్కించనున్నారు. ఇప్పుడు.. సందీప్ వంగా కూడా.. యానిమల్ ఫ్రాంఛైజ్‌తో పాటు.. ప్రభాస్ స్పిరిట్ విషయంలోనూ మాస్టర్ ప్లాన్ వేసాడు అంటూ టాక్ నడుస్తుంది.. అదే స్పిరిట్ ఫ్రాంచైజ్‌లు. స్పిరిట్ సినిమాతో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉండనున్నాయి.
సినిమా క్లైమాక్స్ ని ఒకసారి ఫ్రెంఛైజ్ ఎలిమెంట్‌తో ముగించి.. పార్ట్ 2 కి లీడ్ ఇచ్చేలా ప్లాన్ చేయాలని సందీప్ భావిస్తున్నాడట. కేవలం రెండు మూడు సినిమాలతో ఈ ఫ్రాంఛైజ్‌లు కంప్లీట్ చేయకుండా.. చాలా పెద్ద యూనివర్స్‌లో కథను ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యూనివర్స్‌లో ప్రభాస్ కాకుండా.. మరో ముగ్గురు స్టార్ హీరోలను కూడా రంగంలోకి దించనున్నాడట. ఇందులో భాగంగానే ఇప్పటికే స్టార్ హీరోలలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఆయనతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడని.. స్పిరిట్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందంటూ తెలుస్తుంది. అయితే రాంచరణ్ స్టోరీ స్పిరిట్ ఫ్రాంఛైజా.. లేదా మరో వైవిధ్యమైన కథను సినిమాగా తీస్తాడా అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావాలి.