రియల్ ఫ్రెండ్ షిప్: కష్టకాలంలో త్రివిక్రమ్ చేసిన హెల్ప్ తో సునీల్ లైఫ్ టర్న్..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైపోతుంది. ఇక కమెడియన్ కమ్‌ హీరో.. సునీల్ కి కూడా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ బిజీ స్టార్స్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు.. తమ సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సక్సెస్లను సాధించి రాణిస్తున్నారు. కానీ.. ఈ సక్సెస్ వెనుక ఎన్నో సంఘర్షణలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇక మొదటినుంచి త్రివిక్రమ్, సునీల్ ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరూ సినిమాల్లోకి రాకముందు నుంచే.. పంజాగుట్టలో వచ్చిన రూంలో కలిసి ఉండేవాళ్ళు.

Trivikram doesn't want hamper Sunil's image | Telugu Movie News - Times of  India

ఇండస్ట్రీలో కచ్చితంగా ఏదైనా సాధించాలని కసితో, ఆశయంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత.. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇక.. ఆ సమయంలో తినడానికి తిండి లేక చిల్లీగవ్వ కూడా చేతిలో లేక ఇబ్బందులు పడిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయని సునీల్ ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే.. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ఒకసారి మా ఇద్దరి దగ్గర కేవలం రూ.25 మాత్రమే మిగిలాయి. దాంతో మరుసటి రోజు కూడా తినేలా నేను ప్లాన్ మొదలుపెట్టా. కానీ.. త్రివిక్రమ్ ఆ డబ్బుని తీసుకుని వెళ్లి.. మొత్తం డబ్బుతో ఒక్క కూల్ డ్రింక్ తెచ్చేసి.. ఇద్దరం సగం సగం తాగుదామన్నాడు.

Trivikram Srinivas – Sunil: త్రివిక్రమ్ సునీల్ ను పెద్దగా  పట్టించుకోకపోవడానికి కారణం ఇదేనా..? - OkTelugu

నాకు పిచ్చ కోపం వచ్చింది. రేపు తినడానికి డబ్బులు లేవు.. అప్పుడు ఏం చేస్తావని అడిగా.. దానికి త్రివిక్రమ్ రేపటికి కూడా తినడానికి డబ్బులు ఉంటే రిపు ఏం చేయాలో మనం ఆలోచించలేం. అదే ఇప్పుడు డబ్బులు అయిపోతే రేపటి కోసం ఏం చేయాలని ఇప్పటినుంచి ఆలోచిస్తాం. ముందైతే.. కూల్ డ్రింక్ తాగి చిల్ అవు.. రేపు చూసుకుందాం అన్నాడని సునీల్ వివరించాడు. అసలు ఇంత కూల్ గా ఎలా ఆలోచిస్తాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అతను ఆ రోజు చేసిన ఈ సింగిల్ కామెంట్ నన్ను ఆలోచించేలా చేసింది. అప్పటినుంచి నేను త్రివిక్రమ్ విధానాన్నే ఫాలో అవ్వడం మొదలుపెట్టా అంటూ సునీల్ వివరించాడు. త్రివిక్రమ్ ఎప్పుడు ఒకే మాట చెప్పేవాడని.. ఏ విషయాన్ని భయపడకుండా ముందుకు పోవడమే ఒక మనిషి మొదటి సక్సెస్ అని.. ఆ ఆత్మవిశ్వాసమే నేడు తనను ఆ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సునీల్ చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.