పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఓజీ. రిలీజ్ అయిన ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకోవడంతో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు.. కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మూవీ సక్సస్ మీట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కు.. ప్రకాష్ రాజ్‌కు మధ్య ఇటీవల పొలిటికల్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ ఓజీలో ప్రకాష్ రాజ్ నటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇద్దరి మధ్యన వార్ జరుగుతున్న క్రమంలో.. పవన్‌తో కలిసి ప్రకాష్ రాజ్ నటించడం ఎలా సాధ్యమైందని.. అసలు పవన్ ఎలా ఒప్పుకున్నారు అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే.. తాజాగా పవన్ దీనిపై రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ సినిమాలో ఉంటే మీకు ఏమైనా ఇబ్బందా అని.. ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి నన్ను అడిగారని.. నాకు అసలు ఎవరితోనూ ఎలాంటి ఇబ్బంది లేదు.. పొలిటికల్ అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓ విషయం చెప్పాలంటే నేను ఎక్కడ మొహమాట పడను. అలాగే.. నాతోటి యాక్టర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అందులో తప్పేముండదు అంటూ వివరించాడు. ఒకసారి పర్సనల్గా కూడా అలాంటివి జరుగుతాయి.. ఇక సినిమాకు నేను ఇచ్చే గౌరవం ఏంటంటే.. సినిమా నే నాకు అన్నం పెడుతున్న తల్లి. ఈరోజు నన్ను డిప్యూటీ సీఎం హోదాలో నిలబెట్టింది కూడా అదే.. ఈ క్రమంలోనే సమాజంలో ఉండే అసమానతలపై కోపం బయటికి చూపించడానికి సైతం సినిమా నాకు సహకరించింది.. అందుకే సినిమా అంటే అపారమైన గౌరవం అంటూ వివరించాడు.
ఇక ప్రకాష్ రాజ్ సినిమాలో ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. నేను ఒక్కటే కోరుకుంటున్నా.. సెట్స్ లో పొలిటికల్ సంబంధించిన టాపిక్స్ ఏవి మాట్లాడవద్దని.. ఆయనకు చెప్పండి. అదొక్కటి చేయండి చాలు. నేను ప్రొఫెషనల్ గానే ఉంటా.. ఆయనని ప్రొఫెషనల్ గానే ఉండమనండి.. దాని వల్ల నాకు ఆయనతో వచ్చే సమస్య ఉండదు. పైగా.. ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆయనకి నాకు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్న.. అది పెద్ద ఇష్యూస్ ఏ కాదు. అది వేరే ప్లాట్ ఫామ్ లో మేము చూసుకుంటాం అంటూ పవన్ కళ్యాణ్ టీంకు చెప్పాడట. అంతేకాదు.. ఈ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ విషయాలను షేర్ చేసుకుంటూ.. చివరిగా ప్రకాష్ రాజు గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.