టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సిఎం.. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఓజీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సంచలనాలు సృష్టించిందో.. ఎంతలా రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. పవన్ అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు సైతం గూస్బంప్స్ తెప్పించింది.
ఇక.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు.. ఈ సినిమా గురించి రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆర్.చందు మాట్లాడుతూ.. తన కబ్జా సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఓజీ సినిమా తెరకెక్కిందంటూ షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికే దారితీసాయి. కబ్జా ఓ సాధారణ సినిమాగా నిలిచింది. ఇక ఓజీ స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి భారీ సక్సెస్‌ను అందుకుంది.
ఈ క్రమంలోనే.. అసలు ఆ సినిమాకు.. ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైల్, ఎలివేషన్, స్టోరీ కి పోలికే ఉండదంటూ.. సుజిత్ స్టోరీ స్కిల్స్,, డైరెక్షన్ టాలెంట్ ఈ సినిమాలో క్లియర్ కట్‌గా అర్థమవుతున్నాయంటూ తెలుగు ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కన్నడ డైరెక్టర్ చేసిన కామెంట్స్.. సినిమాపై మరింత చర్చకు దారి తీసాయి. ఈ క్రమంలోనే ఓజీ సినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా ఆడియన్స్ లో మరింత హైప్ పెరుగుతుంది.