టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాల్లో రాణిస్తూనే.. మరోపక్క రాజకీయాల్లోను బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి పవన్ ఒప్పుకున్న సినిమాలను చేయడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైపోయింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలను మాత్రమే చేసి పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయితే.. వాటికి చెక్ పెడుతూ సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా సినిమాలు చేస్తానని ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలను ముందు కంప్లీట్ చేస్తానంటే చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌స్ కంప్లీట్ చేశాడు పవన్. ఇకనైనా బ్రేక్ తీసుకుంటాడని అంత అనుకున్నారు. కానీ.. మళ్ళీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజుకు డేట్స్ ఇచ్చేసారని.. టాక్. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడుగా వ్యవహరించనున్నారంటూ ఫిలింనగర్లో న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. అంతేకాదు.. ఆయనతో పాటే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్‌కు సైతం తన డేట్స్ ఇచ్చాడట. ఎస్ఆర్డి ఎంటర్టైన్మెంట్ అధినేత.. ఇటీవల జనసేనలో కీలక పదవిని పొందిన రామ్ తాళ్లూరికి సైతం డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.
వీళ్లతో పాటే.. మరో నిర్మాతకు కూడా ఆయన తన డేట్స్‌ను కేటాయించారని తెలుస్తుంది. అతరే డివిడి ఎంటర్టైన్మెంట్స్ అధినేత.. డివి దానయ్య. అయితే ఈ వార్తలు వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రెసెంట్ పవన్ ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు నిర్మాతలకు తన డేట్స్ కమిట్ అయిపోయాడు అని సమాచారం నెటింట చక్కర్లు రొట్టడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైంది. నిజంగానే పవన్ ఇలా వరుస సినిమాలో చేసి.. వాటితో సక్సెస్ కొడితే మాత్రం పవన్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళిపోతుంది.