” మన శంకర వరప్రసాద్ గారు ” ముందు బిగ్ టార్గెట్.. చిరు టచ్ చేయగలడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాతో.. అనిల్ రావిపూడి తన మార్క్ చూపించ‌నున్ఆడ‌ట‌. ఇక ఈ సినిమాతో వింటేజ్‌ చిరును చూడబోతున్నారని.. ఆయన కామెడీ టైమింగ్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది అంటూ అనీల్.. గతంలో ఓ సందర్భంగా వివరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఇక 2026 సంక్రాంతి బరిలో.. ఈ సినిమా రిలీజ్ అవ‌నున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఆఫీషియ‌ల్‌గా ప్రకటించారు.

Mana Shankara Vara Prasad Garu': Anil Ravipudi drops Chiranjeevi's festive look on the festive occasion of Ganesh Chaturthi | - Times of India

నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. కాగా.. చిరు, నయన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీం థీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన.. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక.. అనిల్ గ‌త‌ సినిమా.. సంక్రాంతికి వస్తున్నాం ఆడియన్స్‌లో ఎలాంటి రిజల్ట్‌ని అందుకుందో.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో వ‌సూళ్ల‌ను కొల్లగొట్టిందో తెలిసిందే.

Mana Shankara Varaprasad Garu makers release song promo with Chiranjeevi and Nayanthara

ఈ క్రమంలోనే.. అనిల్ టైమింగ్ తో.. చిరు ఎనర్జీ కలిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో.. చిరంజీవి రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టడం ఖాయం అంటూ చెబుతున్నారు. సంక్రాంతి సెలవులు కూడా ఈ టార్గెట్ కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు చిరంజీవి క్యారెక్టర్‌ని కూడా చాలా అద్భుతంగా.. మానవీయత, సరదా, సున్నిత భావాలు అన్నీ కలగలిపిన వ్యక్తిగా చూపించనున్నారని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే.. మన సంకర వరప్రసాద్ గారు సినిమా మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్‌గా నిలవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. మెగాస్టార్ సినిమాతో ఫ్యాన్స్ అంచనాలను అందుకొని.. అనుకున్న టార్గెట్‌ను రీచ్ అవుతాడో.. లేదో.. చూడాలి.