టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ.. ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. సాహో ఫేమ్ బైరెక్టర్ సూజిత్ దర్శకుడిగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా భారీ అంచనాలను సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సంచలనం సృష్టించింది. కాగా.. ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ కు.. ప్రొడ్యూసర్ దానయ్యకు మధ్య మనస్పర్ధలు తలెత్తయంటూ టాక్ వైరల్‌గా మారుతుంది.
అంతేకాదు.. ఈ బ్యానర్ లో స్టార్ట్ అయిన నాని – సుజిత్ సినిమా నుంచి దానయ్య తప్పుకున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఓజీ సినిమాకు సుజిత్ కు రావలసిన రెమ్యునరేషన్ సైతం దానయ్య ఇవ్వకుండా తప్పించుకున్నాడు అంటూ టాక్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదం పై డైరెక్టర్ సుజిత్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. కానీ.. సినిమాను స్టార్టింగ్ నుంచి ఫినిష్ చేసే వరకు తీసుకెళ్లాలంటే ఏం అవసరమో చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటున్నారు.
ఓజీ కోసం మా నిర్మాత మరియు.. నా టీం ఇచ్చిన సపోర్ట్, నమ్మకాన్ని నేను నా మాటల్లో వర్ణించలేను. ఓజీ సినిమా పట్ల పవన్ తో పాటు ఆయన అభిమానులు చూపించిన అమితమైన ప్రేమను వర్ణించడం అసాధ్యం అంటూ చెప్పుకొచ్చాడు. దానయ్య సినిమా కోసం నాకు ఇచ్చిన సపోర్ట్, నాపై ఉంచిన నమ్మకానికి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న. ప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతలు అంటూ సుజిత్ అఫీషియల్ గా లెటర్‌ను రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన ఈ లెటర్ తో వీళ్ళిద్దరి మధ్యన వివాదాల వార్తలకు చెక్ పడింది.