కాంతార 2 ను డామినేట్ చేస్తున్న ఓజీ.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ తుఫాన్.. ఇప్పట్లో ఆగేలాలేదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో మూవీ ఓజీ.. రిలీజై 18 రోజులవుతున్న ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫాన్స్ తో పాటు.. సాధారణ ఆడియ‌న్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాకు పూర్వ వైభవం వచ్చింది. పవన్ సినిమాకు మూడో వారం కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం అంటే ఇటీవల కాలంలో చూడలేదు. దీన్నిబట్టి సినిమాకు ఏ రేంజ్ లో ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇలాంటి క్రమంలోని తాజాగా ఓజి..మ‌రో రికార్డును క్రియేట్ చేసింది.

Watch Kantara: A Legend Chapter 1 (Kannada) in Cinemas | Action | Reel  Cinemas UAE

నిన్న.. చాలా చోట్ల రీసెంట్గా రిలీజై సంచలనం సృష్టిస్తున్న కాంతర చాప్టర్ 1 సినిమా కలెక్షన్ల‌ను డామినేట్ చేసింది. అలా విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో కాంతర 2 కంటే ఎక్కువ కలెక్షన్స్ ఓజీకి ద‌క్కామి. ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా నిన్న ఒక్కరోజులోనే కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలను కూడా కలుపుకొని ఈ సినిమా 18వ‌ రోజున రూ.2 కోట్లకు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్‌లు దక్కించుకుంది.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన అత్తకు సినిమాల్లో ఓజీ కూడా చేరిపోయింది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతుందో.. మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. సాధారణంగా ఒక గ్యాంగ్స్ట‌ర్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో పెద్దగా రెస్పాన్స్‌నో దక్కించుకోదు. ఈ క్రమంలోనే థియేటర్లలోను, ఓటీటీల్లో కూడా పెద్దగా సందడి కనిపించేది కాదు. అలాంటిది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టార్ సినిమా హీరోయిన్ కలెక్షన్లు కొల్లగొట్టడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.