బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా భాషలతో సంబంధం లేకుండా దాదాపు అన్నిచోట్ల ఆడియన్స్ను ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ షో.. మంచి టిఆర్పిను సైతం దక్కించుకుంటున్నాయి. హౌస్ లో నాటకీయ పరిణామాలు, టాస్క్‌లు, గేమ్స్ తో కంటెస్టెంట్లను ఆద్యంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో ఈ బిగ్‌బాస్ షోలపై నెగెటివిటీ ఎక్కువైంది. ఈ క్రమంలోనే.. తాజాగా బిగ్‌బాస్ 9 తెలుగు షోలో చోటు చేసుకున్న పరిణామాలతో.. పెద్ద చిక్కే వచ్చి పడింది.
షో లో హీట్ పుట్టించే కంటెంట్ లేదని ఫైర్ స్ట్రామ్ పేరుతో ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లను బిగ్బాస్ టీం హౌస్ లోకి పంపిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ వీక్‌లో డబల్ ఎలిమినేషన్ అంటూ మొదట ఫ్లోరసైనిని బయటకు పంపించారు. అయితే.. ఫ్లోరా సైని కంటే.. రీతు చౌదరికి ఓట్స్ తక్కువ వచ్చినా.. కావాలనే బిగ్ బాస్ ప్లాన్ చేసి రీతూను హౌస్ లో ఉంచి.. ఫ్లోరా సైనిని బయటకు పంపించారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఈమె తర్వాత హౌస్ నుంచి శ్రీజను ఎలిమినేట్ చేశారు. అది కూడా ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా.. కేవలం వైల్డ్ కార్డు ఎంట్రీ పర్సన్స్ చెప్పిన విధంగా శ్రీజను హౌస్ నుంచి బయటకు పంపించడం మరింత నెగెటివిటీకి కారణమైంది.
ఈ క్రమంలోనే.. బిగ్‌బాస్ భారీ లెవెల్‌లో విమర్శలను ఎదుర్కొంటుంది. కచ్చితంగా.. షోను బాయికాట్ చేయాలని.. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్లతో.. తమకు నచ్చిన వాళ్లను హౌస్ లో ఉంచుకునేటప్పుడు.. ఇక ఈ ఓటింగ్ ప్రాసెస్ ఎందుకు.. రియాలిటీ షో అంటూ దీనికి పేరు ఎందుకు అంటూ.. జనం మండిపడుతున్నారు. అంతేకాదు.. శ్రీజ ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ హౌస్ వివాదమే కొనసాగింది. హౌస్‌లోకి శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని.. లేదంటే బిగ్ బాస్ నిలిపివేయాలంటూ గొడవలు జరుగుతున్నాయి. మరి ఈ వార్ ఎలా ముగుస్తుందో.. శ్రీజను బిగ్‌బాస్ టీం రీ ఎంట్రీ ఇప్పిస్తారో లేదో.. షో ముందు ముందు ఎలా కొనసాగుతుందో.. ఇంకెన్ని కాంట్రవర్సీలు వస్తాయి చూడాలి.