టాలీవుడ్ హీరో నారా రోహిత్ ,హీరోయిన్ సిరిలెళ్ల ఎంగేజ్మెంట్ గత కొంతకాలం క్రితం గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఇద్దరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిపోయిందట. ఇప్పటికే రెండు కుటుంబాల సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ కూడా అయ్యిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా సినీ లెళ్ల పసుపు ఇంట్టో దంచే ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితోను పంచుకుంది.
ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి పెళ్లి పనులు ప్రారంభమైపోయాయి.. ఇంతకీ వెన్యూ ఎక్కడ.. మ్యారేజ్ ఎప్పుడు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోని మొదలైంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లి వేడుక హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారని.. అంతేకాదు ఐదు రోజుల పెళ్లి వేడుక భారీ లెవెల్లో అంగరంగ వైభవంగా జరపనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల అక్టోబర్ 25న హల్దీ ఈవెంట్‌తో ఈ వేడుకలు మొదలవుతాయని సమాచారం.
అక్టోబర్ 26న నారా రోహిత్ ను పెళ్ళికొడుకుగా ముస్తబు చేయడం.. 28న మెహంది, 29న సంగీతం, 30వ తారీకు రాత్రి 10:35 నిమిషాలకు మాంగల్య ధారణ ముహూర్తం పిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు సినీ సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు హాజరుకానున్నారని.. పెళ్లి వేడుక కోసం పనులు కూడా.. సరవేగంగా జరుగుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
View this post on Instagram