టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్వినికి సైతం టాలీవుడ్ ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు. బాలయ్య ఇటీవల కాలంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోవడానికి.. తన చిన్న కూతురు తేజస్విని కూడా ఓ ప్రధాన పాత్ర అంటూ ఎన్నో సందర్భాల్లో వివరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తేజస్విని సైతం నెటింట తెగ వైరల్ గా మారింది. అంతేకాదు.. ఆఖండ 2 సినిమాకు నందమూరి తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది.
ఈ క్రమంలోనే.. అమ్మడి పేరు తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. తాజాగా తేజస్విని నటన వైపు కూడా అడుగులు వేయబోతుంది అంటూ ఓ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ప్రముఖ జువెలరీ సంస్థ తేజస్విని బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి.. అప్రోచ్ అయ్యారట. దానికి తేజస్విని సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ టాక్ వైరల్గా మారుతుంది. ఇందులో వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇది నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే.
తేజస్విని యాక్టింగ్ స్కిల్స్ బుల్లితెరపై చూడాలని అభిమానుల సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఇప్పటివరకు బాలయ్య వారసుడుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ మాత్రం కానేలేదు. 2026లో మాత్రం కన్ఫామ్ గా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడంటూ సమాచారం. ఇక ఎంట్రీ ఎంత లేట్ అయిన.. మోక్షజ్ఞ సినిమా మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేయడం కాయం అనిపిస్తుంది. క్రిష్ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బాలయ్య నెక్స్ట్ ఆలోచన ఏమై ఉంటుంది.. క్రిష్ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందా.. వేచి చూడాలి.