కెమెరా ముందుకి నందమూరి తేజస్విని.. అమ్మడి రాయల్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా..!

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతమంది హీరోలకు అడుగుపెట్టి స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లోను సత్తా చాటుకుంటున్నారు. అయితే ఈ కుటుంబం నుంచి ఆడపడుచులు ఎవరు నటన రంగంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్లో.. ప్రొడక్షన్, బిజినెస్ వ‌ర్క్‌లవైపు మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా.. ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ రెండవ కూతురు తేజస్విని కూడా బిజినెస్, ప్రొడక్షన్ రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ 2 లాంటి భారీ ప్రాజెక్టుకు నిర్మాతగాను పనిచేస్తుంది.

Balakrishna's Daughter Tejaswini Nandamuri Latest Ad | Siddharth Fine Jewellery

ఇక నిన్న మొన్నటి వరకు బ్యాగ్రౌండ్ వర్క్ చూసుకుంటూ కెమెరా వెనుక యాక్టివ్ గా ఉన్న ఈ అమ్మ‌డు.. తాజాగా కెమెరా ముందు తళ్ళుకున మెరిసింది. మొదటిసారి తేజస్విని యాడ్ షూట్లో సందడి చేసింది. ప్రముఖ సిద్ధార్థ ఫైన్ జువెలర్స్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. యాడ్లో తేజస్విని మెస్మరైజింగ్ లుక్, స్టైల్, ఎక్స్ప్రెషన్స్, వాయిస్ అందరినీ ఫిదా చేస్తున్నాయి. కేవలం యాడ్ అని కాకుండా.. ఒకపక్క కాన్సెప్ట్ తో మినీ మూవీల దీని రూపొందించారు. అమ్మడి ప్రతి లుక్ రాయలిటీ ఉట్టి పడేలా కనిపిస్తుంది. ఇక.. ఈ యాడ్ మ్యూజిక్‌ను థ‌మన్‌ అందించడం మరో విశేషం.

Nandamuri Tejeswini Sparkles As Face Of Siddhartha Fine Jewellers - Telugu360

స్పోర్ట్స్ గర్ల్ నుంచి రాయల్ బ్రైడ్ వరకు ఈ యాడ్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. మొదట్లో తేజస్విని ఒక మోడ్రన్ స్పోర్ట్ గర్ల్ గా కనిపించింది.. ఇంటర్ రాక్ క్లైమ్బింగ్ చేస్తూ మెరిసింది. ఇక స్పోర్ట్స్ స్కూల్ నుంచి అమ్మడి రాయల్ ట్రాన్స్ఫర్మేషన్ మరింత హైలెట్.. లగ్జరీ రోల్స్ రాయిస్ కారులో దిగి ప్యాలెస్ లాంటి చోటుకు నడుచుకుంటూ వెళ్లడం.. అక్కడి నుంచి పెళ్లి సందడి, సంగీత్‌లో ట్రెడిషనల్ వేర్లో అదిరిపోయే జువెలరీతో చేసిన సంద‌డి ఆకట్టుకుంది. ఎంతో హుందాగా కనిపించింది. ఇప్పటివరకు అసలు కెమెరా ముందుకొచ్చి ఎలాంటి పాత్రలోనూ నటించని తేజస్విని.. ఇంత కాన్ఫిడెంట్‌గా యాడ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆమె వారసత్వంలోనే నటన ఉందంటూ తెగ మురిసిపోతున్నారు.