కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా.. కాంతారా చాప్టర్ 1తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకున్న సంగతి తెలిసిందే. దసరా కనుకగా అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా.. రెండు వారాల్లో రూ.725 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తే.. ఇప్పుడు ఆ రికార్డులను సైతం బద్దలు కొట్టి కాంతార చాప్టర్ 1 టాప్ పొజీషన్‌లో నిలిచింది. ఇక రియల్ లైఫ్ లో పేరు మార్చుకోవడం, కాంతార గిరిజన తెగ స్టోరీ, ఈ రెండింటికి ఓ సిమ్లారిటీ ఉందని.. అదే ఆధ్యాత్మిక నమ్మకాల బలం అంటూ రిషబ్ శెట్టి నిరూపించాడు.
తన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారతో దేశవ్యాప్తంగా తెలుగులో క్రియేట్ చేసుకున్న రిషబ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన అసలు పేరు, దాని వెనుకున్న ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేశాడు. రిషబ్ మాట్లాడుతూ నా అసలు పేరు ప్రశాంత్ అంటూ చెప్పుకొచ్చాడు. రిషబ్‌గా పేరు మార్చుకోవడానికి నాన్న సలహానే కారణమని.. సినీ ఇండస్ట్రీలో మంచి లక్, అలాగే అద్భుతమైన సక్సెస్ అందడానికి నా పేరును రిషబ్ గా మార్చుకోవాలని నాన్న చెప్పారని రిషబ్ శెట్టి వెల్లడించాడు. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. రిషబ్ తండ్రి ఓ జ్యోతిష్యుడు. అందుకే సినిమా కెరీర్ కోసం పేరు మార్చాలని ఆయన కొడుకుకు సలహా ఇచ్చారు.
ప్రశాంత్, రిషబ్ అనే రెండు పేర్లను కూడా తన తండ్రి సెలెక్ట్ చేశారని రెషబ్ శెట్టి వివరించాడు. ఇక.. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన రిషబ్.. మొదట్లో నీళ్ల క్యన్‌లు వేయడం, డ్రైవర్గా, ఆఫీస్ బాయ్గా, ఇలా రకరకాల వృత్తుల్లో పనిచేశాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న రిషబ్.. తన పేరును మార్చుకున్న తర్వాతే అనూహ్యమైన మలుపులు చూసానని చెప్తున్నారు. ఈ నమ్మకమే నా సినిమాల్లో కూడా సాంప్రదాయం, దైవభక్తి, ఆధ్యాత్మికతను ఎంత బలంగా చూపించడానికి మూల కారణమైందంటూ వివరించాడు. ప్రస్తుతం రిషిబ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.