టాలీవుడ్ ఇండస్ట్రీని నేషనల్ లెవెల్‌కి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎవరు అంటే.. టక్కున రాజమౌళి పేరు వినిపిస్తోంది. ఇక నేడు.. రాజమౌళి పుట్టినరోజు సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలతో పాటు.. ఫ్యాన్స్ సైతం.. రాజమౌళికి విషెస్ తెలియజేస్తూ.. ట్విట్‌లపై ట్విట్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఓ ట్విట్ షేర్ చేసుకున్నాడు, ప్రస్తుతం ఆయన రాజమౌళితో కలిసి (వారణాసి) వర్కింగ్ టైటిల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ టైంలో.. రాజమౌళితో కలిసి.. దిగిన ఓ ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చినట్లు అయింది. ఇక రాజమౌళి బర్త్డేకి విషెస్ తెలియజేస్తూ.. మహేష్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ట్విట్ నెక్స్ట్ లెవెల్ లో వైరల్ గా మారుతుంది. మహేష్ బాబు ఈ ట్విట్‌లో రి యాక్ట్ అవులూ.. రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నుంచి మరో ది బెస్ట్ మూవీ రాబోతుంది సార్.. అంటూ రాసుకొచ్చాడు.
మహేష్ విషెస్‌తో పాటు.. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో కూడా తెగ వైరల్ గా మారుతుంది. దీనిపై ఆడియన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కచ్చితంగా.. ఈ సినిమా మంచి రిజల్ట్ అందుకుంటుందని.. సినిమా ఎంత గొప్పగా ఉంటుందో మీ ఇద్దరి ఫేస్ లలో ఉండే ఆనందం చూస్తేనే అర్థమవుతుందని.. ఒక గొప్ప కంటెంట్ ఆడియన్స్ కి ఇచ్చే టైంలో మాత్రమే అంతా స్వచ్ఛమైన ఆనందం కనిపిస్తుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్ నవంబర్ నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.