కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. కాంతారతో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో.. ఏ రేంజ్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినిమాకు ఫ్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1తో ఆడియన్స్‌ను పలకరించాడు. దసరా సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు కూడా రిషబ్ శెట్టి నే కావడం విశేషం. హంబాలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా దాదాపు అన్ని థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
ఇలాంటి క్రమంలో సినిమా ఓటీటీలో డీల్‌కు సంబంధించిన వార్తలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఓ ప్రముఖ శాటిలైట్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇంతకీ సినిమాను ఎప్పుడు.. ఎక్కడ.. చూడవచ్చని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులే కాదు.. ఓటీటీ రైట్స్ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాయి. అది కూడా.. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సినిమాను ఏకంగా రూ.165 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అంతేకాదు.. శాటిలైట్ హక్కులు రూ.80 కోట్లకు ఆడియో రైట్స్ రూ.30 కోట్లకు అమ్ముడుపోయాయి.
ఈ క్రమంలోని సినిమా రిలీజ్‌కి ముందే దాదాపు రూ.235 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. సాధారణంగా సినిమా ధియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేసుకునేందుకు అనుమతులు ఉంటాయి. ఈ క్రమంలోనే.. కాంతార చాప్టర్ 1 మొదటి వారం.. లేదా చివరి వారంలో ఓటీటీలో టెలికాస్ట్ చేసే అవకాశం ఉందట. ట్రెడ్ వర్గాల అంచనా ప్రకారం.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ మొదటి వారంలోనే సినిమా స్ట్రీమింగ్ అవుతుందట. హిందీ భాషలో మాత్రం.. నిబంధనల ప్రకారం 8 వారాల తర్వాత అంటే నవంబర్ చివరిలో.. లేదా డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.