కాంతారకు ఫ్రీక్వల్‌గా రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. హేంబలే ఫిల్మ్‌స్ బ్యానర్‌పై రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెరిసిన ఈ మూవీలో.. జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, దీపక్ రాం, అన్నాజీ తదితరులు కీలకపాత్రలో మెరిశారు. ఈ సినిమా అక్టోబర్ 2న దసరా పండుగ కానుకగా పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. కేవలం 6 రోజుల్లో.. రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరి.. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు.. వారం రోజులు హైయస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాలీవుడ్ సినిమాల లిస్టులో 2వ స్థానాన్ని సైతం దక్కించుకుంది. అయితే.. ఈ లిస్టులో మొదటి స్థానంలో కేజిఎఫ్ చాప్టర్ 2 నిలవగా.. ప్రస్తుతం కేజిఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేసే దిశగా కాంతార దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే రిలీజై పది రోజులు దాటుతున్న అదే రేంజ్ లో బుకింగ్స్ జరుపుకుంటుంది. ఇక కర్ణాటకలో అయితే సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో పాటు.. రీజనల్ లాంగ్వేజ్ కర్ణాటకలో.. ఎన్ని కోట్లు కలెక్షన్ కొల్లగొట్టిందా అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. సినిమాలో నటినటుల, సాంకేతిక నిపుణులు రమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు అన్నిటినీ కలుపుకొని.. రూ.125 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందట. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్.. కర్ణాటకలో రికార్డ్ లెవెల్లో జరిగిందని.. ఏకంగా 169 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దీంతో అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.170 కోట్ల షేర్ దక్కించుకోవలసి ఉంది. అంటే మొత్తం 340 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకోవాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా.. కాంతారకు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. తమిళనాడులో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు, నార్త్ ఇండియా లో రూ.96 కోట్లు, ఓవర్సీస్ లో రూ.44.5 కోట్లకు ప్రీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు రూ.440 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో జరుపుకుంది. ఈ క్రమంలో రిషబ్ సినిమా లాభాల్లోకి అడుగు పెట్టాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ.850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాంతర చాప్టర్ 1 ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా.. 4400 థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ పది రోజులలో కేవలం ఇండియాలోనే రూ.398.15 కోట్ల నెట్.. రూ.474.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది.
ఇక ఓవర్సీస్ లో ఇప్పటి వరకు.. 3.8 మిలియన్ డాలర్ల కలెక్షన్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ.33.71 కోట్లను సొంతం చేసుకుంది. నాలుగు మిలియన్ల దశగా సినిమా దూసుకుపోతుంది. ఇక న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా, uk, గల్ఫ్, మిడిల్ ఆషియా, యూరప్ తదితర దేశాల్లో రూ.46 కోట్ల మేర వసూళ్లు దక్కాయి. దీంతో.. ఓవర్సీస్‌లో మొత్తంగా రూ.80 కోట్ల గ్రాస్ రాబట్టిన రిషబ్.. మొత్తం 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.555 కోట్ల కలెక్షన్లను దక్కించుకున్నాడు. కాగా ఈ సినిమా రీజినల్ ఏరియా కర్ణాటకలో అయితే పది రోజుల్లో ఏకంగా రూ.150 కోట్ల మార్క్‌ను అందుకునే రికార్డును క్రియేట్ చేసింది. త్వరలోనే.. రూ.200 కోట్లు మార్కులు కూడా టచ్ చేయనుంది. అదే జరిగితే.. కర్ణాటక ఇండస్ట్రీలోనే రూ.200 కోట్ల గ్రాస్ అందుకున్న మొదటి సినిమాగా కాంతార చాప్టర్ 1 రికార్డ్ సృష్టిస్తుంది.