పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయిన తాజా మూవీ కాంతారా చాప్టర్ 1.. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. ప్రస్తుతం థియేటర్‌లలో సక్సెస్ఫుల్‌గా దూసుకుపోతుంది. పాజిటీవ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. కేవలం మౌత్ టాక్ తోనే మంచి కలెక్షన్లు కొల్లగొడుతుంది. కానీ.. కర్ణాటక తప్ప మిగిలిన ఏ ప్రాంతాల్లోనూ ఊహించిన రేంజ్ ధియెట్రికల్ బిజినెస్ జరగడం లేదని.. భారీ నష్టం వచ్చిందని టాక్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. సోమవారం రూ.4 కోట్ల వరకు షేర్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా.. డీసెంట్ కలెక్షన్లు సొంతం చేసుకున్నా.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ కలెక్షన్లు అసలు సరిపోవు.
తెలుగు రాష్ట్రాల్లో.. దాదాపు రూ.95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు.. ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయి.. బ్రేక్ ఈవెన్‌కు ఇంకా.. ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టాల్సి ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డే.. తెలుగు రాష్ట్రాలో రూ.10 కోట్ల 80 లక్షలు రాగా.. రెండో రోజున రూ.10 కోట్ల 22 లక్షలు, మూడవ రోజున రూ.9 కోట్లు 6 లక్షలు, నాలుగవ రోజు రూ.9 కోట్ల 36 లక్షలు, ఐదవరోజు రూ.4 కోట్ల 5 లక్షల మేర షేర్స్ దక్కాయి. నైజాం ప్రాంతంలో అయితే దాదాపు రూ.19 కోట్ల షేర్ కలక్షన్ సొంతమయ్యాయి. ఇక నేటితో ఈ కలెక్షన్లు రూ.20 కోట్ల వరకు చేరే అవకాశం ఉందట.
ఇక సీడెడ్, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, నెల్లూరు ఇలా ఓవరాల్ గా రూ.43 కోట్ల షేర్ వసుళ్లను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఏ రేంజ్‌లో కలెక్షన్లను రాబట్టింది.. కాగా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే.. సినిమాకు ఇంకా రూ.47 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఆ రేంజ్ వసూళ్లను రాబట్టాలంటే సినిమా దీపావళి వరకు నిరంతరాయంగా థియేటర్లలో రన్ అవ్వాలి. కానీ.. ప్రజెంట్ ఉన్న పరిస్థితి చూస్తే సినిమా అంతకాలం థియేటర్లలో నిలబడడం కష్టమే అని టాక్. ఇక.. నేడు నైజం తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ సినిమా బాగా డౌన్ ఫాల్‌ని ఎదుర్కొంది. ఒక పాన్ ఇండియన్ క్రేజీ మూవీ సీక్వెల్ ఈ రేంజ్ లో కలెక్షన్లు పడిపోతాయని విశ్లేషకులు అసలు ఊహించలేదు. ఇక ముందుముందు మూవీ ఏ రేంజ్ కలెక్షన్‌లు అందుకుంటుందో చూడాలి.