ఇండియాలో నెంబర్ 1 హీరో అతనేనా.. లెక్కలు మొత్తం ఛేంజ్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఫ్యాన్ వార్లు జరుగుతూనే ఉంటాయి. తమ హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు తెగ హంగామా చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఓర్మాక్స్ అనే సంస్థ టాప్ 10 ఇండియన్ హీరోస్ లిస్టును రిలీజ్ చేసింది. కాగా.. ఈసారి లెక్కలు పూర్తిగా చేంజ్ అయ్యాయని చెప్పాలి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇంగ్లీష్‌లో బాలీవుడ్ ఖాన్‌ల‌ను చిత్తుచిత్తు చేస్తూ.. టాలీవుడ్ హీరోలు టాప్ 10లో నిలిచారు. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరో.. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Thalaivar didn't make through top 10 is surprising!! : r ...

మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ప్రభాస్ స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలోనూ.. ప్రభాస్ ఈ లిస్టులో టాప్ 1లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి నెంబర్ 1 హీరోగా ప్రభాస్ నిలిచాడు. సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ వరసగా పాన్ ఇండియన్ నెంబర్ 1 పాపులర్ హీరోగా ఇమేజ్‌ను దక్కించుకుంటున్నాడు. ఇక ఈ లిస్ట్‌లో 2వ‌ స్థానంలో తమిళ్ హీరో విజయ్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్.. త్వరలోనే ఈ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. 3వ‌ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు.

Ormax Media on X: "Ormax Stars India Loves: Most popular male film stars in  India (Jun 2024) #OrmaxSIL https://t.co/ghuiir9wgG" / X

ఇటీవల పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఈ క్రమంలోనే 3వ‌ స్థానానికి ఎదిగాడు. ఇక 4వ‌ స్థానంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు. 5వ‌ స్థానంలో చోటు అజిత్ కు చోటు దక్కింది. ఇక మహేష్ బాబు 6వ‌ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ టాప్ 10 లో ఆరుగురు తెలుగు హీరోలు ప్లేస్‌లు దక్కించుకోగా.. తార‌క్ ఫ్యాన్స్ కు మాత్రం బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ మిగిలింది. గత ఏడాది పాన్ ఇండియా లెవెల్‌లో 5వ‌ స్థానాన్ని దక్కించుకున్న తారక్‌.. ఈసారి 7వ‌ స్థానానికి ప‌డిపోయారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ 8వ స్థానంలో నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ 10వ‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇలా టాప్ 10 లో ఆరుగురు తెలుగు హీరోస్ ఉండడం విశేషం.