సినీ ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. నటీనటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఇలా ఎవరి సత్తా వారు చాటుకోవాలని.. సక్సెస్ అందుకొని స్టార్ సెలబ్రిటీలు గా మారిపోవాలని ఆరాటపడుతారు. ఈ క్రమంలోనే మంచి కంటెంట్‌తో దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమై.. తాము తెరకెక్కించిన సినిమాలతో.. సూపర్ హిట్‌లో అందుకుని స్టార్ డైరెక్టర్లుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. తము తీసేది చిన్న సినిమానే అయినా.. సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ.. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా పై హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఆడియన్స్‌లో.. సినిమాపై ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఏర్పడుతుంది.
ఇక ఒకసారి సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంటే చాలు.. ఆ సినిమాకు ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. వాళ్ళు స్టార్ దర్శకుల లిస్టులోకి చేరిపోతూ ఉంటారు. ఇక లిస్టులో సాయి మార్థాండ్ పేరు కూడా వినిపిస్తుందనటంలో సందేహం లేదు. తను తెరకెక్కించిన ఫస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్‌తోనే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు మార్థాండ్. తక్కువ బడ్జెట్ తో.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. అద్భుతమైన కంటెంట్‌కు కామెడీ మిక్స్ చేసి.. రియలిస్టిక్‌గా తెరకెక్కించి.. సాయి మార్థాండ్ సక్సెస్ అందుకున్నాడు.
ఏ క్రమంలోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇండస్ట్రీలోకి దర్శకులుగా అడుగు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. తమకు ఇష్టమైన ఓ స్టార్ హీరోతో తమకు నచ్చిన జానర్లో సినిమా తీసి హిట్ కొట్టాలని. అలా సాయి మార్థాండ్.. నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే చాలా అభిమానం.. ఏదో ఒక రోజు కచ్చితంగా ఆయనతో సినిమా చేయడమే నా డ్రీమ్.. ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే మాత్రం కచ్చితంగా మహేష్ తో అద్భుతమైన లవ్ స్టోరీ తీస్తా. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ఒక వైవిధ్యమైన లేటెస్ట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుందంటూ వివరించాడు. ఇక సాయి మాత్రం చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.