స్టార్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అమ్మడు కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. నా 20 ఏళ్ల వయసులో అసలు గ్యాప్ లేకుండా గందరగోళంగా లైఫ్ లీడ్ చేశానని.. గుర్తింపు కోసం ఆరాటపడ్డానంటూ ఆమె కామెంట్ చేసింది. నా ఫీలింగ్స్ ఏది పైకి కనపడకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డా. ఈ క్రమంలో నన్ను నేను ఎంత కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.
అదే టైంలో.. ప్రేమ గురించి నాకు ఎవ్వరూ చెప్పలేదని.. నిజమైన ప్రేమ మనలోనే దాగి ఉంటుందని.. మనల్ని మనం ప్రేమించుకోవడమే అసలైన ప్రేమ అని ఆ తర్వాత అర్థం చేసుకున్నాను అంటూ సమంత వివరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఆలోచనలను, అభిప్రాయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది సమంత. తన మేకప్ మెన్‌తో సుదీర్ఘమైన చర్చను కొనసాగించినట్లు.. ఈ చర్చలో ఎన్నో అంశాలు మాట్లాడుకున్నాం అంటూ వివరించింది. వాటిలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఇన్స్టాల్ ఓ పోస్ట్ ను షేర్ చేసుకుంది.
30 ఏళ్ల తర్వాత మీ ఆలోచన తీరు మారుతుంది.. ప్రపంచాన్ని మీరు చూసే తీరు మారుతుంది.. మీ అందంలోనూ మార్పులు వచ్చేస్తాయి.. ఇప్పుడు నేను నా మెదడులో ఉన్న ప్రతిదాన్ని వెంట పరుగులు పెట్టడం మానేసి జీవితాన్ని ఆస్వాదిస్తున్న. గతంలో నేను చేసిన తప్పులు తాలూకా జ్ఞాపకాలను మోయడం మానేశౄనంటూ షేర్ చేసుకుంది. పబ్లిక్ లో ఒకలా.. ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా రెండు రకాలుగా ఉండడం నేను మానేశానని.. ఎందుకంటే మీరు మీలా ఉన్నప్పుడే హ్యాపీగా, ఫ్రీడంగా జీవించగలరు అంటూ.. ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది సమంత. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది.