నా లైఫ్ లో ఉన్న ఆ పర్సన్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. త్వరలోనే చెప్తా..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతా రుత్ ప్ర‌భు వ్యక్తిగతంగా ఎన్నో కఠినమైన పరిస్థితిలను ఎదుర్కొని.. ఎన్నో సవాళ్లను దాటుకుని ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ముందు స్ట్రాంగ్ గా నిలబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త లైఫ్ ను మల్చుకుంటుంది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, కెరార్‌లో బ్రేకప్ ఎలా ఎన్నో దశలను అనుభవించిన సమంత.. ఇప్పుడు తనను తాను మళ్ళీ సరికొత్తగా మలుచుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె అదెంటికల్ దా న్యూ ఫేమ్ అనే టాపిక్ పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తన వ్యక్తిగత జీవితం, చేసిన తప్పులు, ఎదుర్కొన్న విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

కెమెరా ముందు జవాబుదారీగా ఉండటం నాకు చాలా కష్టం. ఇది ఒక ఫైనల్ డెసిషన్ లాంటిది కాదు.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. నా జీవితంలో చాలా విషయాలను సరిచేసుకోవాలి. వాటిపై మాట్లాడడం కూడా నాకు అనవసరం అనిపిస్తుంది. నేను పర్ఫెక్ట్ కాదు.. నా నిర్ణయాలు తప్పుగా ఉండొచ్చు.. వాటి ప్రభావం నా లైఫ్ పై తీవ్రంగా పడింది కూడా.. కానీ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా అన్నిటినీ సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టా. ప్రజెంట్ నా లైఫ్ లో ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు ఏమి మాట్లాడలేను.. నాకు తెలిసిన విషయాలు, వాస్తవాలను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వివరిస్తా.

ఇక నా లైఫ్ లో దగ్గర నుంచి చూస్తున్న వాళ్లకి నా పరిస్థితి.. నా బాధలు అర్థమవుతాయంటూ సమంత కామెంట్స్ చేసింది. అంతేకాదు.. నా విడాకుల తర్వాత ఎన్నో ట్రోలింగ్స్, ఎన్నో నెగటివ్ కామెంట్స్ ని ఎదుర్కొన్న.. ఎంతో ఆవేదనకు గురయ్యా.. కొందరు నా విడాకులను పండగల చేసుకున్నారు. నాపై ఎన్నో కామెంట్లు వచ్చాయి. ఎంతగానో బాధించారు. కానీ.. అన్నిటి నుంచి ఎంతో నేర్చుకున్న‌.. అనుభవాల నన్ను మరింత స్ట్రాంగ్ చేశాయి. ఈ దశలో నా హార్ట్ బ్రేక్ అయింది. నా అనారోగ్యం నుంచి బయటపడటం కష్టమైంది. కానీ.. ఆ పేస్ నాకు కొత్త బలాన్ని చేరుకొచ్చింది అంటూ సమంత వివరించింది.