నేడు పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరుగుతున్నాయి. ఆయన అభిమానులతో పాటు.. సినీ ప్రముఖుల సైతం విషెస్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్.. నుంచి ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అదే హనురాగపూడి – ప్రభాస్ కాంపలో రిలీజ్ కానున్న సినిమాకు సంబంధించిన పోస్టర్. దీంతో.. మూవీ టైటిల్ పై క్లారిటీ వచ్చేసింది. సీతారామంతో బ్లాక్ బస్టర్ కొట్టిన హనురాఘవపూడి.. ఇప్పుడు ప్రభాస్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక కొన్ని నెలల క్రితం నుంచి రిక్వెస్ట్ షూటింగ్ ప్రారంభించారు టీం. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా టైటిల్ ఫౌజీ అంటూ గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ టైటిల్ పై క్లారిటీ ఇచ్చేశారు. కాసేపటి క్రితం ఈ టైటిల్ పోస్టర్ ను రివిల్ చేశారు. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే ఫౌజి టైటిల్ సినిమాకు ఫిక్స్ చేసేసారు. ఇక ఈ విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
పద్మవ్యూహాన్ని జయించిన పార్దుడు.. పాండవ పక్షంలో నిలిచిన కర్ణుడు.. గురువు లేకుండా యుద్ద కళలను నేర్చిన ఏకలవ్యుడు.. జన్మతః యోధుడు ఇతను అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ.. మన హిస్టరీలో హైడ్ చేసిన ఎన్నో అధ్యాయాల నుంచి తీసిన ఒక యోధుడి అత్యంత ధైర్యవంతమైన కథ అంటూ క్యాప్షన్ ను జోడించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ క్యారెక్ట్రైజేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో అని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో సినిమాపై ఆడియన్స్ లో మరింత హూప్ పెరిగింది.
पद्मव्यूह विजयी पार्थः
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥#PrabhasHanu is #FAUZI ❤🔥The bravest tale of a soldier from the hidden chapters of our history 🔥
Happy Birthday, Rebel Star #Prabhas ❤️#HappyBirthdayFAUZI#HappyBirthdayPRABHAS… pic.twitter.com/R7hjLRSFfF
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2025