ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి.. బాహుబలిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తానని అనౌన్స్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నుంచి ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ కొత్త ఊపు అందుకుంది. కేవలం టాలీవుడ్ కాదు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. బాహుబలి తర్వాత పుష్ప, కేజిఎఫ్, కాంతార సినిమాలు ఫ్రాంచైజ్‌లు రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకొని ఈ ట్రెండ్ మరింత బలపరిచాయి. ఇందులో భాగంగా.. తాజాగా టాలీవుడ్లో లెక్కలేనని ఫ్రాంఛైజ్‌లు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అలా.. టాలీవుడ్‌కి వెళ్ళాలి లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం.
అఖండ 2, రాజు గారి గది 4, మిరాయ్ 2, హనుమాన్ 2, జాంబిరెడ్డి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో ఏకంగా మూడు ప్రాజెక్టులు తేజ చేతిలో ఉండడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన కాంతర చాప్టర్1కు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఛాన్టర్ 2 కూడా అనౌన్స్ చేసేశారు. ఇక సీక్వెల్స్ అంటే ఒకే హీరో. ఒకే డైరెక్టర్ అని రూల్ ఇప్పుడు అస్సలు ముఖ్యం కాదు.. కేవలం మంచి కంటెంట్ కొనసాగిస్తే చాలు సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బడా స్టార్ హీరోలు కమర్షియల్ బ్యాక్‌డ్రాప్‌తో తో కూడిన కథలను ఎంచుకుంటూ ఫ్రాంచైజ్ సినిమాలలో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అలా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఓజి 2, నితిన్ – కార్తికేయ 3, అల్లు అర్జున్ – పుష్ప 3, ఆర్య 2.. ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ 2 సినిమాల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ సినిమాలకు సీక్వెల్ కానీ.. ఫ్రాంఛైజ్‌లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇండస్ట్రీలో ప్రధానమైన వ్యూహంగా ఈ సినిమాలు మారనున్నాయని.. కొత్త కథలు రాయడం కష్టమైనప్పుడు.. హిట్ కాంబినేషన్‌ను నమ్మి సినిమాలు తీసి ఓపెనింగ్ సాధించే దిశగా ఇండస్ట్రీ నడుస్తుందని.. ఈ ట్రెండ్ సక్సెస్ అయితే ఆడియన్స్.. ఫ్యూచర్ ఫ్రాంఛైజ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలోనే ప్రజెంట్ సినిమాల భవిష్యత్తు అంతా ఫ్రాంచైజ్ సినిమాలపైనే ఆధారపడి ఉంది.