కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన డ్యూడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటీవ్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ క్రబంలోనే ఈ ఏడాది దీపావళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది.
ఈ నెల 17న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించిన సినిమా.. కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి రికార్డు క్రియేట్ చేసింది. మొదటి 4 రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన ఈ సినిమా.. అందరూ ఊహించినట్లుగానే 6 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను సినిమా దాటిందంటూ మైత్రి మేకర్స్ వెల్లడించారు.
బాక్సాఫీస్ దగ్గర డ్యూడ్.. సెంచరీ కొట్టడంతో ప్రదీప్ రంగనాథ్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ చేరింది. ఇప్పటికే ప్రదీప్.. గతంలో నటించిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వచ్చిన డ్యూడ్ సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో.. హ్యాట్రిక్ సక్సెస్ ప్రదీప్ ఖాతాలో పడింది.