సౌత్ స్టార్ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు.. కోలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు. కాంతర చాప్టర్ 1 సినిమాతో.. తాజాగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే అసలు ఈమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా.. రుక్మిణి తండ్రి కల్నల్ వేణుగోపాల్ వసంత్ గారిని అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. వేణుగోపాల్ భారత దేశ సైన్యంలో ఎనలేని సేవలను అందిస్తూ వీరమరణం పొందారు. పఠాన్ కోట్, సిక్కిం, రాంచి, జమ్మూ – కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో తన ఆర్మీ విధులను నిర్వర్తించాడు. ఇక రుక్మిణీ వసంత్ 7 సంవత్సరాల వయసులోనే.. భారతదేశాన్ని ఉగ్ర దాడి నుంచి కాపాడే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయారు.
2007లో ఊరి ప్రాంతంలో.. పాకిస్తాన్ భారీ ఆయుధాలతో ఇండియాలోకి చొరబడుతున్న క్రమంలో.. కల్నల్ వసంత్.. వాళ్లను అడ్డుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఆయన.. నాయకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వాళ్ళు.. ఇండియాలోకి చొరపడకుండా.. అడ్డుకోవడంలో తన ప్రాణాలను కోల్పోయారు వసంత్. తన శరీరంలో 7 బుల్లెట్లు దిగినా.. దేశ రక్షణ కోసం తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నాడు. చివరికి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆయన అమరమరణం పొందారు. ఇలా దేశ రక్షణ కోసం వేణుగోపాల వసంత్ అసాధారణ ధైర్య సాహసాలను గుర్తిస్తూ.. ఆయన మరణానికి అశోక చక్ర పురస్కారంతో గౌరవాన్ని అందించారు. ఈ పురస్కారం దేశంలో అత్యున్నత శాంతి సమయ శౌర్య పురస్కారంగా పిలుస్తారు.
కర్ణాటక రాష్ట్రం నుంచి.. మొదటి భారత దేశ సైనికుడుగా వేణుగోపాల్ వసంత్ సెలెక్ట్ అయ్యారు. ఇండియన్ ఆర్మీలో కొనసాగుతూ దేశ రక్షణలో భాగంగా ఈయన చేసిన ధైర్యసాహసాలు.. ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇక ఆయన మరణానంతరం.. భార్య సుభాషిని.. వసంత్ వీరరత్న ఫౌండేషన్ స్థాపించి.. ఈ ఫౌండేషన్ ద్వారా ఆర్మీ ఫ్యామిలీ లకు మద్దతుగా నిలవడమే కాదు.. అమరవీరుల కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ఆ ఫౌండేషన్‌లో 120 కుటుంబాల పిల్లలకు సహాయం అందింది. ఇలా ఒక గొప్ప కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన రుక్మిణి వసంత్.. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను దక్కించుకుంటుంది. ఇక కెరీర్ పరంగా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతుంది. ప్రజెంట్ కాంతర సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. మరో పక్క సోషల్ మీడియాలోను తెగ వైరల్ గా మారిపోతుంది.