ఆ మేటర్ లో నాగ్, వెంకీలను ఫాలో అవుతున్న చిరు.. టెన్షన్ లో మెగా ఫ్యాన్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున‌ ఎప్పటికి ఇండస్ట్రీలో మంచి ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ను మెయింటైన్ చేస్తూ వైవిధ్యమైన కథలతో ఇప్పటికే నాగార్జున కేవలం హీరో గానే కాకుండా.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి మంచి ఇమేజ్‌ను దక్కించుకున్న‌ సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో.. నాగ్‌.. హీరో కంటే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి ఆడియన్స్‌లో ప్రశంసలు అందుకున్నాడు.

UᎠᏘᎽ on X: "KING 👑 NAGARJUNA & VICTORY VENKATESH Will going to attend  Final Match of #CCL2023 (Today) ⚓ YSR STADIUM, VIZAG #AkhilAkkineni #Agent  #AgentOnApril28th #Nagarjuna #Venkatesh https://t.co/oNHsLOAQJC" / X

ఇక.. మరో సీనియర్ హీరో వెంకటేష్ సైతం గతంలో పలు యంగ్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే.. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోస్ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఫాలో అవ్వాలని సిద్ధమయ్యాడట. హీరోగా నటిస్తూ కొనసాగుతున్న చిరు.. నాగార్జున వందో సినిమా కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారానున్నాడు అంటూ టాక్‌ నడుస్తుంది.

నాగ్, కార్తీక కాంబోలో వస్తున్న వందో సినిమాలో ఓ పవర్ ఫుల్ ముఖ్యమంత్రి రోల్ కోసం మేకర్స్‌ చిరంజీవిని అప్రోచ్ అయ్యార‌ని.. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చిరంజీవి ఇలా ఒక్కసారిగా క్యారెక్టర్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆయన ఇమేజ్కు డామేజ్ అయ్యే ప్రమాదం ఉందంటూ మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు హీరోగా కనిపించే చిరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుల మెరిస్తే.. అసలు సినిమాను ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయడమే కష్టం అంటూ అవిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.