ఆ క్రేజీ హీరోయిన్ తో చరణ్ ఇంటర్నేషనల్ ట్రిప్.. రొమాంటిక్ సాంగ్ కు అంతా సిద్ధం.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎక్కడ బడ్జెట్ పరంగా రాజీ పడకుండా భారీగా ఖర్చు చేసి మరి విజువల్ గ్రాండ్నెస్, ఎమోషనల్ డ్రామా, పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ సమపాలలో ఉండేలా రూపొందిస్తున్నారని టాక్. ఇక అర్బన్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ ఆఫ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవ‌నుంది. చరణ్, జాన్వి కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా యూనిట్ అంతా శ్రీలంకకు చేరుకున్నారట. ప్రకృతి అందాలకు కెరాఫ్‌గా ఉన్న శ్రీలంకలోని అద్భుతమైన లోకేషన్లు అన్నింటిని తీసుకొని.. కొన్ని కీలక సన్నివేశాలను రూపొందించనున్నారని.. అంతేకాదు ముఖ్యంగా ఓ రొమాంటిక్ సాంగ్ కూడా అక్కడ స్పెషల్స్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాటను కుర్ర కారుతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యేలా డిజైన్ చేస్తున్నారని టాక్‌. ఇక కేవలం ఈ ఒక్క సాంగ్ కోసమే స్పెషల్ మ్యూజిక్ టీమ్ కూడా పనిచేస్తుందట. చరణ్, జాన్వి కపూర్ కెమిస్ట్రీ సాంగ్‌కు హైలెట్గా నిల‌వ‌నున్నాయ‌ని.. డైరెక్టర్ ప్ర‌తి షాట్‌ నాచురల్ గా చూపించేందుకు రియల్ లొకేషన్స్ ఎంచుకొని మరి షూట్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

Peddi | జాన్వీ క‌పూర్‌తో క‌లిసి ...

ఇక చరణ్ స్టైలిష్ లుక్ తో పాటు.. జాన్వి గ్లామర్ మెరుపులు, శ్రీలంక ప్రకృతి అందాలు సాంగ్‌కు మరింత హైలెట్ గా మారనున్నాయని.. ప్రతి సీన్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందంటూ మూవీ టీం నుంచి లీక్ వైరల్ గా మారుతుంది. కాగా.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో సహా.. పోస్టర్స్ అన్ని ఆడియన్స్ లో క్రేజీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇక‌ ఈ సాంగ్ షూట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సాంగ్ తర్వాత సినిమాపై హైప్ మ‌రింతగా పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్‌కు రాంచరణ్, జాన్వి కపూర్ ఫ్లైట్లో చేరుకున్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మొత్తంగా శ్రీలంకలో జరగనున్న ఈ రొమాంటిక్ సాంగ్స్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో.. సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో.. చరణ్, జాన్వి ల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో.. లేదో.. చూడాలి.