టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నిజంగానే హౌస్ లో ఫైర్ స్ట్రామ్ మొదలైంది. ప్రతి ఎపిసోడ్ అంతకంతకు ఉత్కంఠ గా మారుతుంది. వీకెండ్ వచ్చే టైంకి షోలో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో అని ఆసక్తి అభిమానులు మొదలైపోతుంది. ఇప్పుడు ఏడో వారంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీకెండ్ ఎలిమినేషన్స్ కామన్ అయినా.. బిగ్‌బాస్ టీమ్ ఇచ్చే ట్విస్ట్‌లు ఆడియన్స్‌లో మరింత ఉత్కంఠతను కలిగిస్తున్నాయి. ఇక ఈ వీకెండ్లో మాత్రం అస్సలు ఎవరు ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నట్టు లీక్ బయటకు వచ్చింది. ఇంతకీ ఈ వారంలో ఎలిమినేషన్ లో ఉన్న పర్సన్స్.. నామినేషన్ ప్రాసెస్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

7వ వారం నామినేషన్లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో రమ్య మోక్ష, రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య, తనుజ, రామ్ రాథోడ్, సంజన గల్రాని, పవన్ కళ్యాణ్ పడాల నామినేషన్స్ లో ఉన్నారు. అయితే.. కెప్టెన్ గా ఉన్న సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలు నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఇక తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను కాపాడుకోవడానికి బిగ్‌బాస్ అభిమానులు ఓట్లు వేస్తూ తెగ అరాటపడ్డారు. ఇక సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం తనజ 37.46% ఓటింగ్, పవన్ కళ్యాణ్ 20.42% ఓటింగ్, దివ్య నికిత 9.81% ,రీతి చౌదరి 8.86% ,సంజనా గల్రాని 8.81% ఓటింగ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే.. దాదాపు వీళ్లంతా సేఫ్ జోన్ వెళ్లిపోయారు.

ఇక మిగిలిన వాళ్లలో రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష మిగలగా.. వీళ్లలో రాము రాథోడ్ 6.49 % ఓటింగ్‌తో 6వ స్థానంలో, సాయి శ్రీనివాస్ 4.83 % ఓటింగ్ తో 7వ స్థానంలో, రమ్య మోక్ష అతి తక్కువ ఓటింగ్ కేవలం 3.31% మాత్రమే దక్కించుకుని చివరి స్థానంలో నిలిచింది. అయితే.. మొదట్లో నామినేషన్ కి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లను బట్టి.. సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని అంత భావించారు. కానీ.. ఆడియన్స్ ఓటింగ్ తో రమ్య మోక్ష తక్కువ ఓట్లు దక్కించుకుని ఎలిమినేషన్‌కు సిద్ధమయింది. అయితే ఇప్పటికే ఎలిమినేషన్ తో సంబంధం లేకుండా వైల్డ్ కార్డుతో వచ్చిన ఆయేషా హౌస్ నుంచి అవుట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం మరో ఎలిమినేషన్ ఉండదని అంత భావించారు. కానీ.. రమ్య మోక్ష ఎలిమినేషన్ అయినట్లు లీక్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

