టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 కొద్ది వారాల క్రితం గ్రాండ్గా ప్రారంభమై.. రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. షోలో.. వారం, వారంకు సరికొత్త ట్విస్టులు ఇస్తూ.. నామినేషన్స్ లో కంటెస్టెంట్లకు దిమ్మతిరిగేలా చేస్తున్నాడు బిగ్ బాస్. అంతేకాదు.. ఇటీవల ఫైర్ స్ట్రామ్ పేరుతో ఆరుగురిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించారు. వీళ్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు పూర్తయింది. ఈ క్రమంలోనే.. కామన్ మ్యాన్, సెలబ్రిటీస్, వైల్డ్ కార్డ్ అండ్ కంటెస్టెంట్ల మధ్యన రీ వాల్ మరింత క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఇప్పుడు హౌస్ రణరంగంగా మారిపోయింది. ఈ క్రమంలోనే నేడు జరిగే ఎలిమినేషన్ ప్రాసెస్ లో బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్‌లు ఇచ్చాడు. అదేంటంటే.. ఇప్పటివరకు బిగ్బాస్ హౌస్ నుంచి 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ బయటకు వెళ్లారు.

వీరిలో సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఆశ సైనీ, శ్రీజా దమ్ము, భరణి శంకర్ ఎలిమినేట్ కాగా.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆయేషా హౌస్ నుంచి బయటకు వచ్చింది. తాజా ఎపిసోడ్లో వైల్డ్ కార్డు కంటిస్టెంట్ రమ్య మోక్ష ఎలిమెంట్ అయిపోయింది. ఈ నేపద్యంలో బిగ్ బాస్ 8వ వారం నామినేషన్ రణరంగంగా మారింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ప్రియా, శ్రీజ, మర్యాద మనీష్, ఫ్లోరా తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ ను వేడెక్కించారు. బిగ్ బాస్ వీరికి రెండు కత్తులు ఇచ్చి.. ఒకటి నామినేట్ చేయడానికి, మరొకటి నామినేషన్ పవర్ ని వేరే వారికి ఇచ్చేలా చేయడానికి గేమ్ ని మరింత ఆసక్తిగా మార్చారు. వీరిలో కొంతమంది మళ్ళీ హౌస్ మెంబర్స్ గా కొనసాగుతారని హింట్ ఇచ్చి మిగతా కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చాడు.
ప్రియా ఎంట్రీతో సంజనకు బిగ్ షాక్ తగిలింది. రోడ్ రోలర్ అంటూ బాడీ షేమింగ్ చేసిన మాటలపై.. ప్రియా కౌంటర్ వేస్తూ ఇది ఫన్నీ కాదు హర్ట్ చేస్తుందంటూ క్లాస్ పీకింది. సంజన నేను కూడా బక్కగా ఏం లేను అని అనడంతో హౌస్ లో హీట్ పెరిగింది. మరోవైపు మర్యాద మనీష్, కళ్యాణ్‌పై ఫైర్ అయ్యాడు. ఇమ్ము నిన్ను నమ్మాడు కానీ.. నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటూ సెటైర్లు వేశాడు. దీంతో.. కళ్యాణ్, ఇమ్ము మధ్య వివాదం మొదలైంది. ఇమ్మనియేల్ కూడా తనూజను నామినేట్ చేస్తూ నాకోసమే ఆడింది కానీ.. ఓటింగ్ మోసం చేసింది అన్నాడు. దీంతో.. తనూజ రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు అంటూ మండిపడింది.
కళ్యాణ్, రామ్ రాతోడ్ మధ్య కూడా వివాదం తలెత్తింది. నువ్వు కేప్టన్ కాలేవని కళ్యాణ్ అంటే.. నువ్వు కెప్టన్ కాలేదంటూ రామ్ ఫైన్ అయ్యాడు. చివరిగా మర్యాద మనిషి ముద్దు మాటలు చెప్పి మందారంపూలు చెవిలో పెడుతున్నావు అంటు తనుజపై షాకింగ్ కామెంట్స్ చేసాడు. మొత్తానికి వారం నామినేషన్ డ్రామా, ఫుల్ ఎమోషన్, ఫుల్ ఫైర్ తో రసవత్తరంగా కొనసాగుతుందని ప్రోమోలో అర్థమైపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 8వ వారం నామినేషన్ లిస్ట్ ప్రకారం దీవెల మాధురి, రీతూ చౌదరి, సంజన, తనూజ, డిమాన్, పవన్ కళ్యాణ్, గౌరవ్, రాము రాథోడ్ ఈసారి నామినేషన్‌లో ఉండనున్నారు. అంతేకాదు.. ఈ ప్రసెస్ కొనసాగనుంది. దాని పై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.


