బిగ్ బాస్ 9: పాత కంటేస్టంట్ల రీ-ఎంట్రీ ట్విస్ట్.. నామినేషన్ లో డబల్ హిట్..!

బిగ్బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ ప్రసారంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్ హౌస్ లో హీట్‌ను మరింతగా పెంచేస్తున్నాయి. ఈ వారం అయితే నామినేషన్ ప్రాసెస్‌లో హీట్ డబల్ అయింది అనడంలో సందేహం లేదు. పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి నామినేషన్ ప్రాసెస్‌ను దగ్గర ఉండి చేపించారు. ప్రేక్షకులు కూడా కనీవినీ ఎరగని రేంజ్‌లో ఈ నామినేషన్ కొత్త కొత్త మలుపులతో కొనసాగాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ప్రియ, మనీషా, ఫ్లోరా, శ్రీజాలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారికి నామినేషన్ చేసే పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్.. మిగతా సభ్యుల మధ్య హీటెడ్ డ్రామాలు ప్రారంభించేలా ప్లాన్ చేశాడు. ఇక.. నామినేషన్ ప్రాసెస్‌లో ట్విస్టులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నామినేషన్ మొదలుపెట్టే ముందు బిగ్బాస్ ఓ రూల్ పెట్టాడు.

హౌస్ లో ఉన్న సభ్యులు కాదు.. బయటకు వెళ్లిన పాత కంటెస్ట్ంట్లు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరిని నామినేట్ చేయాలి. అదేకాదు.. వారు మరొక సభ్యుడుకి కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వచ్చని.. ఈ క్రమంలోనే సాయి తనకున్న స్పెషల్ ఇమ్యూనిటీ పవర్‌తో నామినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు. అలాగే.. కెప్టెన్ ఇమ్మాన్యువల్ కూడా నామినేషన్ లో తప్పించుకున్నాడు. ఇక హౌస్‌లోకి ఫస్ట్ ప్రియా ఎంట్రీ ఇచ్చి సంజన నామినేట్ చేసింది. తర్వాత.. తన పవర్‌ను కళ్యాణ్‌కు ఇచ్చింది. కళ్యాణ్‌ ఏమాత్రం ఆలోచించకుండా రామ్ రాథోడ్ని నామినేట్ చేశాడు. తర్వాత ప్రియా ఎగ్జిటై నేరుగా కళ్యాణ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత మనీష్‌కు ఇచ్చిన్న పవర్‌తో ఇమ్మనుయేల్.. తనూజను నామినేట్ చేసాడు. వీళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ హౌస్ లో హీటెక్కించింది.

తర్వాత.. ఫ్లోరా షైనీ ఎంట్రీ ఇచ్చి క‌ళ్యాణ్‌ను నామినేట్ చేసి సుమన్ కు నామినేషన్ పవర్ ఇచ్చింది. సుమన్ దాంతో సంజన నామినేట్ చేశాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ హౌస్ కు టెన్షన్ పెట్టించింది. ఫ్లోరా ఎగ్జిట్ తర్వాత సంజన.. సుమన్ అసమర్ధ కెప్టెన్సీని మళ్ళీ విమర్శించడం మొదలెట్టింది. ఆ ప్రస్థానంలో మాధురికి సంజనకు మధ్య మాటల యుద్ధం జరిగింది. మాధురి, సంజనను షట్‌అప్ అంటూ ఘాటుగా అరిచింది. ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగా మారింది. ఇక చివరికి.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. నామినేషన్ చేయకముందే మాధురి తనూజలను తప్పు పట్టింది. దీంతో బిగ్ బాస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి.. నువ్వు ఇక్కడ నామినేషన్ కి వచ్చావు.. అదే చెయ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

అప్పుడు శ్రీజ.. కళ్యాణ్‌ను నామినేట్ చేసి.. తన పవర్ మాధురికి ఇచ్చింది. నీతోనే నామినేట్ చేసిన మాధురి.. నోటికొచ్చినట్లుగా చడామడా తిట్టేసింది. దీంతో.. రీతు కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ దాదాపు కొట్టుకునే వరకు వెళ్ళింది. ఆర్గుమెంట్‌లో మాధురి.. పవన్, రీతు బాండ్ ఒక‌ ఇన్ ప్యూర్ రిలేషన్ అంటూ మాట్లాడడం హౌస్ మొత్తానికి షాక్‌ ఇచ్చింది. పవన్ కూడా దీంతో అసహనాన్ని వ్యక్తం చేసాడు. ఈ క్రమంలోనే.. ఎపిసోడ్ మొత్తం నామినేషన్ల కంటే గొడవలతో ఎక్కువగా హిట్ పుట్టించింది. మాధురి మాట తీరు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. గేమ్ లో ఎప్పటికప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడే తప్పుడు మాటలు శనివారం ఎపిసోడ్లో నాగ్ ఆమెకు ఇచ్చే వార్నింగ్స్ కామన్ గా మారిపోయాయి. టోటల్‌గా ఈ ఎపిసోడ్ మళ్లీ యాక్షన్ మోడ్ లోకి దిగారు. డ్రామా, ఎమోషన్, ఆర్గ్యుమెంట్స్ ఇలా అన్ని కలగలిపి రసవత్తరంగా సాగింది.