తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9.. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ దమ్ము శ్రీజ పేరు తెగ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియా వేదికగానే కాదు.. బయట కూడా పెద్ద దుమారమే రేగింది. కామన్ మ్యాన్ కేటగిరీలో అగ్ని పరీక్షను ఎదుర్కొని.. తన ఆట తీరుతో అదరగొట్టిన శ్రీజ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మొదటి రోజు నుంచే.. తన గేమ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మధ్యలో.. అనవసరమైన విషయాలకు చిరాకుపడుతూ.. అరుస్తూ.. ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పించినా.. తర్వాత తన తప్పులు సరిదిద్దుకొని ఆటతీరుతో మెప్పించింది.

ఇంతలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే.. శ్రీజ ఎలిమినేషన్ ఆడియన్స్ నిర్ణయించింది కాదు. కేవలం ఫైర్ స్ట్రామ్ పేరుతో హౌస్ లోకి అడుగు పెట్టిన వైల్డ్ కార్డ్స్ ఆమెను ఎలిమినేట్ చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బిగ్బాస్ 9 పై విపరీతమైన నెగటివ్ ఏర్పడింది. ఆమెకు అన్యాయం జరిగిందంటూ బిగ్ బాస్ హౌస్ పై భారీ ఎత్తున ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. శ్రీజకు రీఎంట్రీ ఇవ్వాలంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. శ్రీజ ఎలిమెనేట్ అయ్యి రెండు వారాలు అవుతున్నా ఇప్పటికీ శ్రీజ రీఎంట్రీ కోసం అంత ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే.. బిగ్బాస్ జర్నీ గురించి శ్రీజ వరుసగా తన పోస్టులను పంచుకుంటుంది.

ఈమె రియంట్రి ఇస్తుంది అంటూ వస్తున్న వార్తలు పై తాజాగా క్లారిటీ ఇచ్చింది. నేను అసలు అనుకోలేదు అంటూ వివరించిన శ్రీజ.. ఫస్ట్ రెండు వారాలు నేను జనాలకు నచ్చలేదు. తర్వాత ఆట తీరు మార్చుకున్నా. ఫిజికల్ టాస్కులతో గెట్టి పోటీనే ఇచ్చా. అయితే.. అసలు ఊహించని ఎలిమినేషన్ నాకు జరిగింది. కనీసం నా జర్నీ కూడా ప్లే చేయకుండా ఇంట్లోంచి బయటకు పంపారు. దాంతో.. రీఎంట్రీ ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు అది నిజంగా జరిగితే బాగుంటుందంటూ శ్రీజ వివరించింది. అయితే రియంట్రీ ఉంటే కచ్చితంగా హౌస్ లోకి వెళ్తానని చెప్పుకొచ్చింది. అయితే ప్రజెంట్ దమ్ము శ్రీజ మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ అవ్వబోతుంది అంటూ టాక్ గట్టిగా వైరల్ అవుతుంది.

