హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని డైరెక్టర్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మా. ఈ సినిమా దెబ్బతో ఆయన పేరు పాన్ ఇండియా లెవెల్‌లో తెగ మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే.. ప్రశాంత్ వర్మ యూనివర్సిటీతో ఒక ప్రొడక్షన్ బ్యానర్ను స్థాపించి.. దాదాపు ఈ బ్యానర్ పై అన్ని హిందూ ఇతిహాసాలతోనే సినిమాలు తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే పివిసి యూనివర్స్ నుంచి రానున్న సినిమాలు పై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక.. మరీ ముఖ్యంగా.. కాన్సెప్ట్ లోని పాత్రలను డిజైన్ చేసేటప్పుడు చాలా వైవిధ్యంగా ఆలోచిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ క్రమంలోనే.. తాజాగా మహాకాళి సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భూమి శెట్టి హీరోయిన్గా మెరవనుంది.
తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజై.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. అసలు ఇంతకీ ఈ భూమి శెట్టి ఎవరు.. ప్రశాంత్ వర్మ ఏరికోరి ఆమెనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణమేంటి.. అసలు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఈ భూమి శెట్టి కన్నడ ఇండస్ట్రీలో సీరియల్ నటిగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈమెను ప్రశాంత్ వర్మ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం.. తనైతేనే ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావించడమేనట. భూమిశెట్టి కన్నడలో వచ్చిన కిన్నెర అనే టీవీ సీరియల్ లో నటిగా మెరిసింది. తెలుగులోను నిన్నే పెళ్ళాడుతా లాంటి సీరియల్ ఆడియన్స్‌ను పలకరించింది. ఈ క్రమంలోనే.. మంచి ఇమేజ్‌సంపాదించుకుంది.

అంతేకాదు.. పలు సినిమాల్లో కీలకపాత్రలోను మెరిసింది. తను నటించిన పాత్రలకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే భూమి శెట్టి సినిమా కథల సెలక్షన్స్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తుంది. తెలుగులో మొదటిసారి నటించిన సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. తర్వాత.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలోని నటుడు సత్యదేవ భార్యగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో మహాకాళి సినిమాతో హీరోయిన్గా అవకాశాన్ని కొట్టేసింది. మహాకాళి పాత్రలో భూమిశెట్టి ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వనుందో.. ఏ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకొనుందో చూడాలి. అయితే.. ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లుక్ తో మాత్రం అందరిని ఫిదా చేసేసిన ఈ అమ్మడు.. సినిమాతో సక్సెస్ అందుకుంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంటుందనే చెప్పాలి.

