ఆ టైంలో తిండి తినడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడ్డాడు.. సమంత

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ లోనే కాదు.. దాదాపు అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఒక్కో సినిమాకు కోట్లల్లో రెమ్యూనరేషన్ చార్జ్‌ చేస్తూ.. భారీ ఆస్తులను కూడబెడుతుంది. ఇక.. చిన్న యాడ్ లేదా ప్రమోషన్ ఉందంటే రూ.2 కోట్లకు తక్కువ రెమ్యునరేషన్ అయితే అందుకోదట. ఈ క్రమంలోనే.. అమ్మడు లగ్జరీ లైఫ్ లీడ్‌ చేస్తుంది. ఇక.. ఈమె కారులు, ఇల్లు, ఫారెన్‌ టూర్‌లు, ట్రిప్‌లు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కెరీర్ ప్రారంభంలో.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సామ్‌ ఇప్పుడు.. ఈ రేంజ్ లో సక్సెస్ అందుకుంది.

Samantha Ruth Prabhu's 6 of the most luxurious cars — Audi Q7, BMW 7 Series  and more | GQ India

ఈ క్రమంలోనే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సమంత మాట్లాడుతూ.. తన గతాన్ని గుర్తు చేసుకుని నేను ఎప్పుడూ నా గతాన్ని మర్చిపోను అంటూ చెప్పుకొచ్చింది. ఓ సాధారణ చిన్న కుటుంబం నుంచి వచ్చా. ఎన్నో బాధలను కుటుంబం భ‌రించింది. ఒకానొక టైంలో సరిగ్గా తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు చూసాం. కానీ.. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన నేను మొదటి సినిమాతోనే చాలా మారా.

Samantha Ruth Prabhu's birthday: A peek into her lavish lifestyle, net  worth, luxurious house, and car collection

రాత్రికి రాత్రి స్టార్ అయిపోయా. క్రేజ్ ఫేమ్ స‌క్స‌స్ ఇవన్నీటిని ఒక్కసారిగా ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ.. నేను ఎక్కడ గర్వంతో పొంగిపోలేదు. కారణం నేను ఓ గొప్ప లక్షణంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చా. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. విజయాలకు పొంగిపోకుండా.. కష్టపడితేనే మన లైఫ్ ఉంటుందని నన్ను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటా. మోటివేట్ చేసుకుంటా. నన్ను నేను.. దానికి తగ్గట్లుగా మార్చుకుంటూ ముందుకు వెళుతున్నా అంటూ సమంత వివరించింది. సమంత చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.