పవన్ తో అనిల్.. స్టోరీ లైన్ తెలిస్తే పూనకాలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు.. హరిహర వీరమల్లు డిజాస్టర్‌తో నిరాశ చెవి చూసిన పవన్ ఫ్యాన్స్‌కు.. ఓజీ సినిమా.. ఇంత త్వరగా ఫుల్ మిల్స్ ఇస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా.. ఓ సినిమాకు రూ.300 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ కలెక్షన్లు కొల్లగొట్టాలంటే తెలుగుతోపాటు.. అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ.. సినిమా మాత్రం ఇతర భాషలకంటే ఎక్కువగా తెలుగు వర్షన్ వల్లే రూ.300 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే పవన్ సత్తా ఏంటో మరోసారి రుజువు అయింది.

ఇక త్వరలోనే పవర్ నుంచి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ సినిమా ఆడియ‌న్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ నెలలోపు షూట్ మొత్తం కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని.. ఫిబ్రవరి నెలలో లేదా మార్చి నెలలో రిలీజ్ చేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. పవన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ విషయంలో.. ఆడియన్స్‌లో ఆశ‌క్తి మొదలైంది. ఈ క్రమంలోనే.. దిల్ రాజు బ్యానర్ లో పవన్ కళ్యాణ్ సినిమా తీయబోతున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో.. మల్కాజ్‌గిరి సాయిరామ్‌ థియేటర్లో జరిగిన ఓజి సక్సెస్ సెలబ్రేషన్స్ లో దిల్‌రాజు స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్నాడు.

ఇందులో భాగంగానే.. ఆయన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. త్వరలోనే తను ప్రొడ్యూసర్‌గా పవన్‌తో సినిమా చేయబోతున్నానని అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చేసాడు. ఇక.. సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడుగా వ్యవహరించనున్నాడట. అనిల్ వద్ద ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ స్టోరీ ఉందని.. పవన్ కళ్యాణ్ టైం ఇస్తే ఆ స్టోరీని వినిపించడానికి దిల్ రాజు, అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సినినెక్స్‌ట్ స‌మ‌ర్‌లో మా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఫాన్స్ లో ఆసక్తి మొదలైంది. కచ్చితంగా ఇలాంటి స్టోరీ లైన్ తో పవన్ హీరోగా.. అనిల్ ఓ సినిమా తీస్తే మాత్రం ఆడియన్స్‌కు పూనకాలు కాయం.