ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనా సరే.. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనే నటిస్తూ ఆడియన్స్‌ను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ సత్తా చాటుకుని రికార్డులు సైతం క్రియేట్ చేస్తున్నారు. అయితే.. స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిన వారంతా ప్రెసెంట్ చేస్తున్న సినిమాలు కాకుండా ఫ్యూచర్ సినిమాల లైనప్ కూడా ముందే సిద్ధం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా కామన్ అయిపోయింది. అయితే.. ఇలా నెక్స్ట్ ప్రాజెక్ట్లను కూడా ముందే ఫిక్స్ అవడం పై అభిప్రాయాలు రెండు కోణాల్లో వినిపిస్తూ ఉంటాయి. హీరోలు ఇలా వరుసగా ముందే సినిమాలను లైన్లో పెట్టుకోవడం కెరీర్ సేఫ్ ప్లానింగ్ అంటూ.. ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా సెట్స్‌పైకి వచ్చేస్తే హీరోకి గ్యాప్ ఉండదు.
మార్కెట్ కంటిన్యూ అవుతుంటుంది. ఇక సినిమాలో సక్సెస్ అయితే తిరుగులేని క్రేజ్ ఏర్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అయితే మరో కోణంలో మాత్రం ఇది చాలా రిస్క్ అని చెబుతూ ఉంటారు. పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో చాలామంది సెలబ్రిటీస్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ముందే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ క్రమంలోనే హీరో ఒకసారి రెండు మూడు సినిమాలకు కాల్ షీట్లు ఇచ్చేయడంతో కాల్ షీట్ల విషయంలో గజిబిజి ఏర్పడడంతో పాటు.. సినిమా టీం మొత్తానికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే.. తాజాగా అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే గందరగోళం మొదలైంది అంటూ ఓ టాక్ నెటింట వైరల్‌గా మారుతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్‌తో ఇమేజ్ను నేషనల్ లెవెల్‌లో చాటుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ కూడా హై రేంజ్‌లో చార్జ్ చేస్తున్నాడు.
కేవలం ఒక్క సినిమాకు దాదాపు రూ.100 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఈ క్రమంలోని ప్రజెంట్ అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్‌లో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ రేంజ్‌లో తెరకెక్కుతుందంటూ.. ఇప్పటికే ఫిలిం సర్కిల్లో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. బడ్జెట్, నేషనల్ లెవెల్ కాస్టింగ్, టాప్ టెక్నికల్ టీం.. అంతా సినిమాకు మరింత హైప్ ను పెంచేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో.. అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓ స్టార్ డైరెక్టర్ తో చేయనున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం.. అట్లీ మూవీ కంప్లీట్ అయిన వెంటనే బన్నీ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో పాన్ ఇండియా లెవెల్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇది కూడా.. భారీ లెవెల్లో తెరకెక్కనుందని సమాచారం. ఇలాంటి క్రమంలో మరో బాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. అయితే ఆ సినిమాలో విలన్ రోల్ లో అల్లు అర్జున్ నటించనున్నాడని టాక్. దీంతో బన్నీ ఫాన్స్ లో పూనకాలు మొదలైనా.. కొంతమంది నెటిజన్స్ మాత్రం అల్లు అర్జున్ వరుసగా తమిళ్. హిందీ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ తెలుగు డైరెక్టర్లు నెగ్లెట్ చేస్తున్నారని.. దీనివల్ల ఆయన కెరీర్‌కు ప్రమాదం తప్పదు.. ఇలాంటి రిస్క్‌లు అవసరమా అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.