టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తో తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్‌లో మరో సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏఏ 22 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా విషయంలో.. మొదటి నుంచి ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చినా చాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అట్లీ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. అట్లీ మాట్లాడుతూ.. ఏదైనా మొదట ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఈ సినిమాతో ఆడియన్స్‌కు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం.. ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం అంటూ వివరించాడు. మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ మాకు దేవుడు తోడుంటాడని ఆయన వివరించాడు.
దేవుని దయవల్ల ఇప్పటి వరకు మేము అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందని.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించడం రిస్క్ అనుకోవడం లేదంటూ వివరించాడు. నేను ఈ ప్రాజెక్టును చాలా ఎంజాయ్ చేస్తున్నా. మరి కొన్ని నెలల్లో మీరు ఈ సినిమాను ఆస్వాదిస్తారు అంటూ అట్లీ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే అట్లీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమా పై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి మొదలైంది.