ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పవర్ఫుల్ లీక్..!

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం తన PVC యూనివ‌ర్స్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే.. PVCU యూనివర్సిటీలో పలు ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక హనుమాన్ తర్వాత జై హనుమాన్ పై ఆడియ‌న్స్‌లో భారీ హైన్‌ మొదలైంది. ఇలాంటి క్రమంలో.. అదే యూనివర్స్ నుంచి మరో వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో మహాకాళి రూపొందించినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించనుంది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇండియాలోనే ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకు సూపర్ హీరో సినిమాలన్నీ కేవలం మేల్ లీడ్‌తోనే సాగేవి. ఈసారి మహాకాళి రూపంలో స్త్రీ శక్తిని ఒక విప్లవాత్మక స్టైల్‌లో తెరపై చూపించబోతున్నారు. కాళీ దేవుని ప్రేరణగా తీసుకుని సినిమా రూపొందుతుంది. మిస్టిక్ పవర్, ఆధ్యాత్మికత, సూపర్ హీరోయిజంతో మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. తాజాగా.. ఈ మూవీ ఆసక్తికరమైన అప్డేట్‌ను షేర్ చేసుకున్నారు. అక్టోబర్ 30న ఉదయం 10 గంటలకు మహంకాళి సినిమా స్పెషల్ అప్డేట్‌ను రిపీల్ చేయనున్నట్లు తాజాగా ఓ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.

ఆ పోస్టర్‌లో రక్తంతో తడిసిన త్రిశూలాన్ని పట్టుకుని ఉన్న ఒక లేడీ చేతిని చూపించారు. ఆ సీన్ లోని ఆ ఇంటెన్స్ ఫీల్ చూసిన ఫ్యాన్స్ లో గూస్ బంప్స్‌ వస్తున్నాయి. ఇండియన్ మైథాలజీని.. ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా విజువల్, సూపర్ హీరో, యాక్షన్ తో మిక్స్ చేసి స్క్రీన్ పై చూపించే ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ యూనివర్సిటీ అడుగులు వేస్తుంది. హనుమాన్‌ తర్వాత మహాకాళి రూపంలో దివ్య శక్తికి.. సూపర్ హీరో రూపం ఇస్తూ ఈ సినిమా తెర‌కెక్కనుంది. పూజ అపర్ణ డైరెక్షన్లో రానున్న ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.