భారీ ధరకు అఖండ 2 ఆడియో రైట్స్.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా నాలుగు సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్న బాలయ్య.. ప్రజెంట్ అఖండ 2 తాండవంతో.. ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా.. వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై మాస్ ఆడియ‌న్స్‌లో ఓ రేంజ్‌లో హైప్‌ నెలకొంది. ఇక.. ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో అఖండను మించిపోయే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా డివోషనల్, యాక్షన్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి.. ప్రేక్షకులను కట్టిపడేసేలా బోయపాటి డిజైన్ చేశాడట.

Akhanda 2 Release Date Announced: Nandamuri Balakrishna's Epic Sequel To  Storm Theatres On December 5 | Telugu Cinema News - News18

బాలయ్య పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్‌.. బోయపాటి మార్క్ యాక్షన్, థ‌మన్ ఎనర్జిటిక్ మ్యూజిక్.. కలిసిన ఓ పవర్ ఫుల్ బ్లాస్ట్ కాంబో అ్ండ 2. ఈ సినిమాలో థ‌మన్ మ్యూజిక్ ఈసారి థియేటర్‌లు తగలబడిపోతాయంటూ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అఖండకు థ‌మన్‌ ఇచ్చిన మ్యూజిక్.. థియేటర్ లో అక్కడక్కడ సౌండ్ బాక్స్‌లు కాలిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య నటించిన మూడు సినిమాలు వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మ‌హ‌రాజ్‌ సినిమాకు కూడా థ‌మనే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూడు సినిమాలు మ్యూజిక్ పరంగా ఆకట్టుకోవడమే కాదు.. సూపర్ హిట్లుగా నిలిచాయి.

Big Update from Akhanda 2 Loading - Telugu360

దీంతో ఆల్బమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కచ్చితంగా అదరగొడతాడంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రికార్డ్‌లు క్రియేట్ చేయడం ఖాయమని స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమాపై అంచనాలు ఆకాశానికి అందుతున్న క్రమంలో.. అఖండ 2 ఆడియో రైట్స్.. ఆదిత్య మ్యూజిక్ సంస్థ దాదాపు రూ.10 కోట్లు కేటాయించి మరి సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక ఇప్పటికే అఖండ 2 తాండవం మ్యూజిక్ పై ఆడియన్స్‌లో హైప్‌ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. థ‌మ‌న్‌. ఈసారి ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు.. మ్యూజిక్ లిస్ట్ అందిస్తాడ.. లేదా.. ఫ్యాన్స్ అంచనాలను నిజం చేస్తాడా.. లేదా.. చూడాలి.