టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి ఫ్రాంచైజ్‌లతో.. పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ప్రభాస్.. సల్లార్‌తో సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కల్కి సక్సెస్‌ను కంటిన్యూ చేయడమే కాదు.. వెయ్యికోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి.. సంచలనం సృష్టించాడు. ఇక.. ఈ సక్సెస్ ట్రాక్‌ను రాజాసాబ్‌తో కంటిన్యూ చేస్తాడా.. లేదా.. సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడా అనే సందేహాలు అందరిలోనూ మొదటి నుంచి నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆ డౌట్లకు క్లారిటీ వచ్చేసిందా.. లేదా.. అసలు రాజాజాబ్ ట్రైలర్‌తో మారుతి ఫ్యాన్స్‌ను మెప్పించాడా ఒకసారి చూద్దాం.
దాదాపు రెండేళ్లుగా సెట్స్‌పై కొనసాగుతున్న రాజాసాబ్ ట్రైలర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగిందని చెప్పాలి. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మూవీపై హైప్ పెంచేశాడు. అయితే.. ఇంకా సినిమాకు మూడు నెలల సమయం ఉండగానే.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు. సాధారణంగా లో బడ్జెట్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మారుతి.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోను డైరెక్ట్ చేయగలడా.. అనే డౌట్ కేవలం అభిమానుల్లోనే కాదు.. మారుతి ఇంట్లో వారిలోనూ మొదలైంది. మారుతిని తీసుకుని ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడని.. చాలామంది అభిప్రాయాలను సైతం వ్యక్తం చేశారు. ఒకానొక టైంలో మారుతి సైతం ప్రాజెక్ట్ వదిలేయాలని భావించాడట. కానీ.. ప్రభాస్ సపోర్ట్ తో సినిమా తీశానని తానే స్వయంగా వెల్లడించాడు.
ఇక తాజాగా.. సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ బుచ్చిగాడు లో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకొని.. పాన్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ స్టెప్ ను సెట్ చేసి ఆడియన్స్ ఎంటర్టైన్ చేసేలా ప్లాన్ చేశాడు మారుతి. డార్లింగ్ ఫ్యాన్స్ మెచ్చే విధంగా.. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్‌ను ట్రైలర్.. కాస్త మేరకు పెంచింది. ఇక రెబల్ స్టార్‌ను ఫ్యాన్స్ మరోసారి చూసే అదృష్టం మారుతి కల్పించాడు. కానీ.. ఈ మూడు నిమిషాల ట్రైలర్ కు థమన్ ఇచ్చిన బిజయం.. చాలా అంటే చాలా డల్ గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. థమన్ రెగ్యులర్‌గా ఇచ్చే సౌండింగ్ల్‌లా ఉందే కానీ.. కిక్ ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రభాస్ రేంజ్ లో ఎలివేషన్స్ ఏమీ లేవని.. మిక్సింగ్ కూడా అంతంత మాత్రమే అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.