పుష్ప ఫ్రాంఛైజ్ సినిమా కేవలం అల్లు అర్జున్ అభిమానులనే కాదు.. సినీ ప్రియులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సాలిడ్ బ్లాక్ బస్టర్‌లు అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక సినిమాకు కంటిన్యూషన్ పుష్ప 3 ఉంటుందని ఎండ్ కార్డులు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 3పై ఎన్నో రకాల ఊహాగానాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గ్రాండ్ లెవెల్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేదికపై సుకుమార్ పుష్ప 3కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ అప్డేట్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ సుకుమార్ చేసినా కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
సైమా 2025 అవార్డ్స్ వేడుకలు దుబాయ్ లో గ్రాండ్ లెవెల్ లో జరగగా ఈ ఈవెంట్లో సౌత్ నుంచి ఆల్మోస్ట్ బడా స్టార్స్ అందరూ హాజరై సందడి చేశారు ఇందులో ఎన్నో సినిమాలు ఎంతోమంది స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఇక పుష్ప 2కు ఒక్కసారిగా అవార్డులు పంట పండింది. దాదాపు 5 విభాగాల్లో నామినేషన్లలో పుష్ప 2 విన్నర్ గా నిలిచింది. వరుసగా ఐదు అవార్డులు దక్కాయి. ఈ క్రమంలోనే అవార్డును అందుకునే సమయంలో సుకుమార్ సైమా వేదికపై మాట్లాడుతూ.. పుష్ప 3కి సంబంధించిన కీలకమైన ప్రకటన చేశాడు. దీంతో పుష్పత్రి పై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న అనుమానాలన్నింటికీ చెక్ పడింది.
ఇప్పటివరకు పుష్ప 3 గురించి కొన్ని ప్రచారాలు బయటకు వచ్చాయి. పుష్పా 3 ది ర్యాంపేజ్ అనే టైటిల్ తో ఓ పోస్టర్ తప్ప ప్రాజెక్ట్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సుకుమార్ చేసిన కామెంట్స్‌తో వాటన్నింటికి క్లారిటీ వచ్చేసింది. అవార్డ్ తీసుకున్న తర్వాత సుకుమార్ మాట్లాడుతూ పుష్ప 3 కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో సరికొత్త హోప్ మొదలైంది. పుష్ప సిరీస్ మొదటి భాగం పుష్పాది రైజ్ 2020లో వచ్చి సంచలనం సృష్టించగా.. పుష్ప 3 ది రూల్ 2024లో రిలీజ్ అయ్యి రికార్డుల ఊచ కోత కోసింది. ఇప్పుడు సుకుమార్ పుష్ప 3 పై అఫీషియల్ గా ప్రకటించడంతో సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో అని ఆసక్తి అభిమానంలో మొదలైంది.