త్వరలోనే ఆ హీరో చనిపోతాడా.. వేణు స్వామి మాటలే నిజం అవ్వనున్నాయా..?

టాలీవుడ్ సెన్సేషనల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచాయ‌లు అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్ల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆయన.. పలు సందర్భాల్లో విమర్శలు, వివాదాలను సైతం ఎదుర్కొన్నాడు. అయితే.. చాలా వరకు వేణు స్వామి స్టార్ సెలబ్రిటీల భవిష్యత్తు గురించి చెప్పిన జాతకాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఆయన చెప్పిన కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పింది చెప్పినట్లుగా జరిగిపోవడంతో.. ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ కూడా ఏర్పడింది. అయితే.. పెళ్లిళ్లు, విడాకులు కెరియర్ లో వచ్చే మార్పులు.. హెల్త్ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా కామెంట్లు చేస్తూ కాంట్రవర్షల్ ఆస్ట్రాలజర్ గా మారాడు వేణు స్వామి. ఈ క్రమంలోనే.. తాజాగా ఆయన గ‌తంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హ‌ట్ టాపిక్‌గా మారాయి.

Astrologer Venu Swamy Facts About Tollywood Famous Anchor & Star Hero Life  | Manastars

ఓ హీరోయిన్, ఓ స్టార్ హీరో త్వరలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారని.. అనారోగ్య కారణాలతో పెద్ద నష్టం ఎదుర్కొంటారని.. ఆయన ప్రిడిక్షన్ చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ హీరో ఎవరు.. హీరోయిన్ ఎవ‌రో మాత్రం రివీల్ చేయని వేణు స్వామి.. ఎంతోమందితో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆయనపై బూతుల వర్షం కురిపించారు. ఇలాంటి ఊహాగానాలు అతనికి ఎప్పుడు అలవాటే.. ఫేక్ ప్రిడక్షన్స్ చెప్తూ చెత్త వాగుడువాగుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చూస్తున్నాడు అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఆయన మాటలు లైట్ తీసుకున్నారు. కానీ.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈ ప్రిడిక్షన్ నిజంగానే సక్సెస్ అవుతుందేమో అనే సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

తన ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు పూర్తిగా దూరమైపోయ్యాడ‌ట. ఆయనకు ఉన్న అనారోగ్యం సాధారణమైనది కాదని.. కొన్ని న్యూస్ ఛ‌ఖానల్స్ వెల్లడించాయి. ఈ క్రమంలోనే గత నాలుగైదు నెలల నుంచి విదేశాల్లోనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు తన హెల్త్ పై కేర్ తీసుకుంటున్నాడని సమాచారం. ఎంత డబ్బు ఉన్నా ఆయన ఆరోగ్య సమస్య మాత్రం పూర్తిగా తగ్గే అవకాశం లేదట. అయితే.. ఇప్పటివరకు ఈ విషయం పూర్తిగా సీక్రెట్ గా ఉంది. ఆయన ఇమేజ్ డామేజ్ కాకూడదనే ఉద్దేశంతోనే మీడియాకు దూరంగా ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారట. కానీ.. తాజాగా ఈ వార్త మీడియాకు లీక్ అవడంతో.. అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఇంత పెద్ద హీరోకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటూ.. అంత ఆశ్చర్యపోతున్నారు. వేణు స్వామి చెప్పిన మాటల్లో నిజం ఎంతో కొంత ఉండే ఉంటుందని.. ఆ కామెంట్స్ కి హీరో అనారోగ్యాన్ని ముడి పెడుతూ సోషల్ మీడియాలో భారీ లెవెల్ లో చర్చలు నడుపుతున్నారు.