తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. కొద్ది గంటల క్రితం విదేశీ సినిమాలపై 100% జిఎస్టి ని విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమపై భారీగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కారణం.. అమెరికా మార్కెట్ తెలుగు సినిమాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్ ఇలా ఫ్యాన్స్ అమెరికాలో వచ్చిన కలెక్షన్లను చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ అనేది ఒక మంచి ఆదాయం అనడంలో సందేహం లేదు. ఇలాంటి టైంలో డ్రోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ పెద్ద దెబ్బగా మారింది. అమెరికాలో తెలుగు సినిమాలంటే సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏ రేంజ్ లో రచ్చ రచ్చగా ఉంటుందో అమెరికాలో డలాస్, న్యూ జెర్సీ, చికాగో నగరాల్లోనూ ఇదే రేంజ్ లో హడవడి వాతావరణం ఉంటుంది.
ఫ్యాన్ వీర్‌లు జరుగుతూనే ఉంటాయి. బాలయ్య, పవన్, మహేష్, తారక్, ప్రభాస్, చరణ్ ఇలా ప్రతి టాలీవుడ్ హీరోకు అమెరికాలో మంచి క్రేజ్.. అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు జరిగే సందడి మామూలుగా ఉండదు. వందల కార్లలో ర్యాలీలు.. థియేటర్లలో సెలబ్రేషన్లు, పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడాలు ఇలా రకరకాలుగా తెలుగు రాష్ట్రాల ఊరమాస్ సెంటర్లో అభిమానుల గోల ఎలా అయితే ఉంటుందో అమెరికాలో అలాంటి హడావుడి ఉంటుంది.
ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం వల్ల ఈ హడావిడ మాయమవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో అమెరికన్ హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాకు 20 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కాయి. అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ.170 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇది చాలా బిగ్ నెంబర్. అలాగే ఆర్‌ఆర్ఆర్ సినిమాకు దాదాపు 15 మిలియన్ డాలర్లు.. ఇండియన్ రుపీస్ లో రూ.120 కోట్లు పైనే కలెక్షన్స్ వచ్చాయి. ఈ రెండు రాజమౌళి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కాయి కాబట్టి ఈ రేంజ్ లో వచ్చాయి అనుకోవచ్చు. కానీ.. టాలీవుడ్‌లో తెరకెక్కిన స్టార్ హీరోల చిన్న సినిమాలు సైతం 2 మిలియన్ల నుంచి 8 మిలియన్ డాలర్ల మధ్యలో వసూళ్లను కొల్లగొట్టాయి.
అంటే.. కనీసం రూ.17 కోట్ల నుంచి రూ.60 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలాంటి క్రమంలో.. విదేశీ సినిమాలపై 100% జిఎస్టి విధిస్తే అమెరికాలో నేరుగా రిలీజ్ చేసే తెలుగు సినిమాలపైనే భారీగా ఎఫెక్ట్ పడుతుంది, భారీగా జిఎస్టి,, అమెరికన్ డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ ఎగ్జిబిటర్లకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం పోతుంది. దానికి తోడు 100% జిఎస్టి వల్ల డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలను పెంచాల్సి ఉంటుంది. రిజల్ట్ తెలుగు సినిమాలు చూసే ఆడియన్స్ టికెట్ల భారం.. ఎక్కువ కావడంతో సినిమాలకు దూరమవుతారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఆర్థిక మాంద్యం దగ్గర పడుతున్న వేల.. టికెట్ రేట్లు కూడా పెరిగితే తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు బదులు ఓటీటిల్లో సినిమాలు చూసేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. స్టార్ హీరోలకు కాస్త క్రేజ్ వల్ల కలెక్షన్లు వస్తాయేమో కానీ.. చిన్న సినిమా హీరోలకైతే.. ఇక అమెరికా మార్కెట్ పడిపోయినట్లే అని నిపుణులు చెబుతున్నారు.